వారిపై కన్నేసిన మృణాల్‌ ఠాకూర్‌.. ప్లాన్‌ అదుర్స్‌ | Sakshi
Sakshi News home page

వారిపై కన్నేసిన మృణాల్‌ ఠాకూర్‌.. ప్లాన్‌ అదుర్స్‌

Published Fri, Feb 9 2024 8:52 AM

Mrunal Thakur New And Upcoming Movies - Sakshi

ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన నటి మృణాల్‌ ఠాకూర్‌. చాలా మంది నటీమణులాగానే బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. మొదట్లో మరాఠీ చిత్రాల్లో నటించిన మృణాల్‌ ఠాగూర్‌ ఆ తరువాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా ఈ భామకు టాలీవుడ్‌ నుంచి లక్కీచాన్స్‌ వరించింది. అదే సీతారామం చిత్రం. ఆ చిత్రం సక్సెస్‌ మృణాల్‌ ఠాగూర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్‌ నాన్న' చిత్రం హిట్‌ కూడా ఈమె ఖాతాలో పడింది.

(ఇదీ చదవండి: సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌)

మంచి జోష్‌ మీదు ఉన్న మృణాల్‌ ఠాకూర్‌కు  విజయ్‌ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రంలో ఛాన్స్‌ దక్కింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉంటే మృణాల్‌ ఠాకూర్‌పై ఇప్పుడు కోలీవుడ్‌ కన్ను పడింది. అక్కడ ఈ అమ్మడి కోసం మూడు భారీ ఆఫర్లు ఎదురుచూస్తున్నాయనేది తాజా సమాచారం. అందులో భాగంగా ఏఆర్‌ మురుగదాస్‌ శివకార్తికేయన్‌ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా కమల్‌ హాసన్‌ తన రాజ్‌కుమార్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై శింబు కథానాయకుడిగా నిర్మించనున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌ కథా చిత్రంలో మృణాల్‌ ఠాగూర్‌ను ఒక హీరోయిన్‌గా ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో మరో హీరోయిన్‌గా కీర్తీ సురేష్‌ నటించబోతున్నట్లు సమాచారం. కాగా మృణాల్‌ ఠాగూర్‌ మరో లక్కీచాన్స్‌ కూడా తలుపు తట్టినట్లు తెలుస్తోంది. నటుడు అజిత్‌ ప్రస్తుతం విడాముయర్చి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం పూర్తి కాగానే అజిత్‌ మరో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మార్క్‌ ఆంటోని చిత్రంతో ఫేమ్‌ సంపాదించుకున్న ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో నటించడానికి ఆయన సిద్ధం అవుతున్నారు. ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్‌ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇలా కోలీవుడ్‌లో మృణాల్‌ ఠాకూర్‌ కరెక్ట్‌ ప్లాన్‌తో అడుగులేస్తూ.. వరుసగా దండెత్తడానికి సిద్ధమవుతున్నారన్నమాట.

 
Advertisement
 
Advertisement