తెలుగింటి కోడ‌లిగా సీతారామం బ్యూటీ.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Mrunal Thakur: తెలుగింటి కోడ‌లు కాబోతున్న సీతారామం హీరోయిన్‌.. ఇదిగో క్లారిటీ!

Published Fri, Nov 3 2023 8:15 PM

Mrunal Thakur Dismisses to Her Wedding Rumours - Sakshi

ఒక్క‌సారి సెల‌బ్రిటీ స్టేట‌స్ వ‌చ్చిందంటే చాలు.. వారు ఏయే సినిమాలు చేస్తున్నార‌నేదానితో పాటు ఏమేం చేస్తున్నారు? ఎక్క‌డికి వెళ్తున్నారు? అనే విష‌యాల‌పైనా ఓ క‌న్నేసి ఉంచుతారు జ‌నాలు. వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాలపైనా అభిమానులు ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ క్ర‌మంలో కొన్నిసార్లు సెల‌బ్రిటీల మీద లేనిపోని రూమ‌ర్లు కూడా వ‌స్తుంటాయి. అలా ఈ మ‌ధ్య‌ సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి ఓ వార్త వైర‌ల్‌గా మారింది.

అప్పుడు లావ‌ణ్య‌.. త‌ర్వాత మృణాల్‌
తాను త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. నిర్మాత అల్లు అర‌వింద్ ఆ మ‌ధ్య లావ‌ణ్య త్రిపాఠితో తెలుగ‌బ్బాయిని పెళ్లి చేసుకుని టాలీవుడ్‌కు కోడ‌లిగా వ‌చ్చేయ‌మ‌న్నాడు. ఆయ‌న అన్న‌ట్లుగానే లావ‌ణ్య మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌ను పెళ్లి చేసుకుని ఇక్క‌డికి కోడ‌లిగా వ‌చ్చేసింది. ఇటీవ‌ల జ‌రిగిన‌ సైమా అవార్డ్స్ వేడుక‌లో మృణాల్ ఠాకుర్‌తోనూ ఇదే మాట అన్నాడు అల్లు అర‌వింద్. టాలీవుడ్‌కు కోడ‌లిగా వ‌చ్చేయ్ అని స‌ర‌దాగా అన్నాడు. కానీ కొంద‌రు దీన్ని సీరియ‌స్‌గా తీసుకుని త్వ‌ర‌లో ఆమె తెలుగింటి కోడ‌లు కాబోతుంద‌ని నిర్ణ‌యానికొచ్చేశారు.

క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌
ఈ క్ర‌మంలో త‌న పెళ్లి వార్త‌ల‌పై మృణాల్ ఠాకూర్ స్పందించింది. మీ మ‌న‌సును ముక్క‌లు చేస్తున్నందుకు న‌న్ను క్ష‌మించండి.  డిజైన‌ర్లు, స్టైలిష్ట్‌లు, నా కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రులందరూ అదే ప‌నిగా ఫోన్ చేసి పెళ్లి గురించి అడుగుతున్నారు. తెలుగ‌బ్బాయితో పెళ్లికి రెడీ అయ్యావ‌ట‌గా అని ప్ర‌శ్నిస్తున్నారు. నేనూ అదే అడుగుతున్నా... ఇంత‌కీ ఆ తెలుగ‌బ్బాయి ఎవ‌రో నాక్కూడా చెప్పండి. మ‌రో విష‌యం.. మీ అంద‌రికీ సారీ.. నాకు పెళ్లి అంటూ వ‌స్తున్న ప్ర‌చారంలో ఎటువంటి నిజం లేదు. నిజానికి ఈ వార్త చ‌దివి ఎంత న‌వ్వుకున్నానో! పోనీ.. మీరే నాకు ఓ అబ్బాయిని చూసి పెట్టి అత‌డు ఎక్క‌డుంటాడో క‌నుక్కొని, పెళ్లి వేదిక కూడా రెడీ చేస్తే నేను వెంట‌నే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: చై జ్ఞాప‌కాలు ప‌దిలంగా సామ్‌తోనే.. చెరిగిపోని ప‌చ్చ‌బొట్టు!

Advertisement
Advertisement