వారం రోజులు అక్కర్లేదు! | The movie Vettaiyan is directed by TJ Gnanavel | Sakshi
Sakshi News home page

వారం రోజులు అక్కర్లేదు!

Oct 3 2024 3:33 AM | Updated on Oct 3 2024 3:33 AM

The movie Vettaiyan is directed by TJ Gnanavel

‘‘ఖైదు చెయ్‌ ఖైదు చెయ్‌... నేరస్తుణ్ణి ఖైదు చెయ్‌... ఖైదు చెయ్‌ ఖైదు చెయ్‌... నేరస్తుణ్ణి ఖైదు చెయ్‌’’ అంటూ మొదలవుతుంది ‘వేట్టయాన్‌: ద హంటర్‌’ సినిమా తెలుగు ట్రైలర్‌. రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వేట్టయాన్‌’. అమితాబ్‌ బచ్చన్, ఫాహద్‌ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. 

లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘వేట్టయాన్‌’ ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు. కానీ పోరంబోకులకు బాగా భద్రత ఉంది’, ‘నేరస్తుణ్ణి వెంటనే పట్టుకోవాలి. 

అందుకు ఏ యాక్షన్‌ అయినా  తీసుకోండి’, ‘ఒక వారంలో ఎన్‌కౌంటర్‌ జరిగిపోవాలి’ (రావు రమేశ్‌), ‘అక్కర్లేదు సార్‌... వారం రోజులు అక్కర్లేదు... మూడే రోజుల్లో డిపార్ట్‌మెంట్‌కు మంచి పేరు వస్తుంది’ (రజనీకాంత్‌), ‘కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు’ (రానా), ‘న్యాయం అన్యాయం అయినప్పుడు న్యాయంతోనే సరిచేయాలి. 

అంతేకానీ... ఇంకో అన్యాయంతో కాదు’ (అమితాబ్‌ బచ్చన్‌), ‘నన్ను ఏ పోస్ట్‌లోకి తిప్పికొట్టినా నేను మాత్రం పోలీస్‌వాడినే సార్‌... నా నుంచి వాడిని కాపాడటం ఎవ్వరి వల్ల కాదు (రజనీకాంత్‌)’ అన్న డైలాగ్స్‌ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement