
కమల్ హాసన్ నటించిన మోస్ట్ అవైటేడ్ చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిరత్న దర్శకత్వం వహించారు. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు (1987) సినిమా తర్వాత కమల్ హాసన్, మణిరత్నం చేస్తున్న చిత్రమిదే కావడం విశేషం. జూన్ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రి ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు.
తాజాగా ఈ మూవీకి తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ విధిస్తోన్న వినోద పన్నును భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా థగ్ లైఫ్ పన్నులు తగ్గించాలని కమల్ హాసన్ ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్-19 తర్వాత తమిళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వల్ల పన్ను తగ్గించాలని కమల్ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం వినోద పన్ను 8.6 శాతం నుంచి 4 శాతానికి పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, సమాచార మంత్రి తిరు ఎంపీ సామినాథన్‌కు కూడా ధన్యవాదాలు తెలిపింది. చాలా మంది నిర్మాతలు, పంపిణీదారులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు కాగా.. ఇటీవల కన్నడ భాషపై కమల్ హాసన్ కామెంట్స్‌తో పెద్ద వివాదం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్‌ను సినిమాపై నిషేధం విధించారు.