డ్రగ్స్‌ నివారణకు 'మా' సహకారం.. ఆపరేషన్‌ సంకల్ప్ ప్రారంభం | Movie Artists Assoaciation Support For Free Telenaga | Sakshi
Sakshi News home page

Movie Artists Assoaciation: డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చేందుకు 'ఆపరేషన్ సంకల్ప్'

Jun 11 2025 9:30 PM | Updated on Jun 11 2025 9:30 PM

Movie Artists Assoaciation Support For Free Telenaga

టాలీవుడ్‌ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) మరో ముందడుగు వేసింది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే  లక్ష్యంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) కలిసి 'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో  వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో  'ఆపరేషన్ సంకల్ప్' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ శ్రీ సందీప్ షాండిల్యా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల రవి, ఎస్పీ శ్రీ పి. సీతారామ,  డిపార్ట్‌మెంట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ (DEPWD) డైరెక్టర్ శ్రీమతి శైలజ  హాజరయ్యారు. డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మించే మా లక్ష్యం దిశగా ఇది ఒక శక్తివంతమైన అడుగు అని అందరూ ఆకాంక్షించారు. 

Advertisement
 
Advertisement
Advertisement