నిజాన్ని నిజాయితీగా చెప్పాం | Sakshi
Sakshi News home page

నిజాన్ని నిజాయితీగా చెప్పాం

Published Tue, Sep 12 2023 4:11 AM

Month Of Madhu Movie Press Meet - Sakshi

‘‘మంత్‌ ఆఫ్‌ మధు’లో మాకు తెలిసిన నిజాన్ని నిజాయితీగా చెప్పాం. శ్రీకాంత్‌గారు అద్భుతంగా తీశారు. ఇది ఫీమేల్‌ సెంట్రిక్‌ సినిమా కాదు’’ అని స్వాతి రెడ్డి అన్నారు. నవీన్‌ చంద్ర, స్వాతి రెడ్డి జంటగా శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం వహించిన చిత్రం ‘మంత్‌ ఆఫ్‌ మధు’.

యశ్వంత్‌ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 6న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో శ్రీకాంత్‌ నాగోతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని మేమెంత ΄్యాషనేట్‌గా తీశామో.. ప్రేక్షకులకు కూడా అంతే చక్కగా చేరువవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు  ‘‘ఈ చిత్రం 90 శాతం షూటింగ్‌ని వైజాగ్‌లో చేశాం’’ అన్నారు యశ్వంత్‌ ములుకుట్ల.

Advertisement
 
Advertisement