స్పెషల్‌ సాంగ్‌..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా?

Monal Gajjars Remuneration For Special Song Will Shock You - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-4 అనంతరం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది గుజరాతీ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌. అప్పటివరకు  ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌తో సొంతం చేసుకుంది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ తర్వాత అఖిల్‌తో క్లోజ్‌గా మూవ్‌ కావడం, ఈమె వల్లే వారిద్దరు గొడవ పడటం..ఈ సీజన్‌కి హైలెట్‌గా నిలిచాయి. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో ఎక్కువ ఎపిసోడ్లు కూడా ఈ ముగ్గురిపైనే ప్రసారం జరిగింది. ఇది మోనాల్‌కు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి. దీంతో హౌస్‌ నుంచి బయటకు వచ్చాకా.. ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీ అయిపోయింది.  (ఇల్లు కొనబోతున్న మోనాల్‌‌?!)

ఇటీవలె బెల్లంకొండ  శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటమ్ సాంగ్‌ చేసి మరింత పబ్లిసిటీని తెచ్చుకుంది ఈ గుజరాతీ భామ. అంతేకాకుండా ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం మోనాల్‌ 50 లక్షల రూపాయల భారీ రెమ్యునరేషన్‌ అందుకుందట. ప్రస్తుతం ఆమెకున్న ఫేమ్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు కూడా మోనాల్‌ అడిగినంత మొత్తంలో ఇవ్వడానికి ఏ మాత్రం వెనకడుగు వెయ్యడం లేదని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఏదైనా షాపు ఓపెనింగ్‌కి సైతం 10 లక్షలు ఇవ్వాలని కండిషన్‌ పెట్టినట్లు పలు వార్తలు షికార్లు చేస్తున్నాయి.  దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు అవకాశాలు ఉన్నప్పుడే వాటిని  సద్వినియోగం చేసుకుంటే బెటర్‌ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. (ఆరేళ్లు రిలేష‌న్‌షిప్‌, డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా)

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top