బ్రేక‌ప్‌తో డిప్రెష‌న్‌లోకి వెళ్లా: మోనాల్ | Bigg Boss 4 Telugu: Monal Gajjar Breakup Story | Sakshi
Sakshi News home page

ఆరేళ్లు రిలేష‌న్‌షిప్‌, డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయా

Dec 15 2020 8:33 PM | Updated on Dec 15 2020 8:39 PM

Bigg Boss 4 Telugu: Monal Gajjar Breakup Story - Sakshi

బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్ తెలుగు, గుజ‌రాతీ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ గుర్తింపు ద‌క్కించుకోలేదు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు రాని పాపులారిటీ ఒక్క‌ బిగ్‌బాస్‌తో ఆమె సొంత‌మైంది. గుజ‌రాతీ భామ అయినా క‌ష్ట‌ప‌డి మ‌రీ తెలుగు నేర్చుకుని ముద్దుముద్దుగా మాట్లాడేది. ఆమె తెలుగులో మాట్లాడ‌టాన్ని కింగ్ నాగార్జున సైతం మెచ్చుకునేవారు. అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను బుట్ట‌లో వేసుకున్న మోనాల్ ప‌ద్నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. అయితే అఖిల్‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం బిగ్‌బాస్ షో ముగిసేవ‌ర‌కు ఆమె హైద‌రాబాద్‌లోనే ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే చిలుకూరి బాలాజీని కూడా సంద‌ర్శించారు. అనంత‌రం ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో త‌న బ్రేక‌ప్ స్టోరీని బ‌య‌ట‌పెట్టారు. అలాగే త‌న సినీ ప్ర‌యాణాన్ని గుర్తు చేసుకున్నారు. మ‌రి మోనాల్ ఏమేం మాట్లాడిందో ఆమె మాట‌ల్లోనే.. (చ‌ద‌వండి: రోడ్డుపై గొడవ.. చాకచక్యంగా డీల్‌ చేసిన నటుడు)

'నా తొలి చిత్రం ఒక కాలేజ్ స్టోరీ. కానీ మొద‌ట రిలీజైంది మాత్రం సుడిగాడు. త‌ర్వాత మ‌ల‌యాళంలో ఒక ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆ వెంట‌నే త‌మిళంలో చేశాను. 2015లో బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి చేశాను. అదే స‌మ‌యంలో నేను డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాను. ఆరేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్న నా బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేక‌ప్ అయింది. దాని నుంచి కోలుకోలేక‌పోయాను. అత‌డు సౌత్‌కు చెందిన వ్య‌క్తి‌. అందుకే నేను ఇక‌పై ద‌క్షిణాదికి రాకూడ‌ద‌ని నిశ్చ‌యించుకుని గుజరాత్‌కు వెళ్లిపోయాను. అప్పుడే గుజ‌రాత్‌లో ఆఫ‌ర్లు రావ‌డంతో సినిమాలు చేసుకుంటూ బిజీ అయ్యాను. 2018-19లో మ‌రాఠీ సినిమాలు చేశాను. 2019లో హిందీలో కాగ‌జ్ చిత్రం చేశాను. అది వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న రిలీజ్ కానుంది. ఇప్పుడు మ‌రో మంచి ప్రాజెక్ట్ కూడా వ‌చ్చింది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే చెప్తాను' అని మోనాల్ చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్‌ను గెలిపించిన హారిక‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement