
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్‌గా వినిపించే పదమే. చాలామంది అగ్రతారల పిల్లలు కూడా సినిమానే కెరీర్‌గా ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వారి బాటలోనే నడుస్తూ ఇండస్ట్రీలో తమ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మరో స్టార్ హీరో కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు విస్మయ అరంగేట్రానికి సిద్ధమైంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జూడే ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఆశీర్వాద్ సినిమాస్‌కు ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను మోహన్ లాల్ సైతం ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ రాసుకొచ్చారు.
కాగా..విస్మయ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ.. రచయితగా రాణిస్తోంది. రచయితగా ఆమె తన తొలి పుస్తకం 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్'ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల చేసింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ పట్ల కూడా నైపుణ్యం సాధించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.
మరోవైపు విస్మయ సోదరుడు ప్రణవ్ మోహన్‌లాల్ సైతం జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'ఆది'మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రణవ్ ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్'-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తుడురుమ్ అనే మూవీతో అలరించారు.
Dear Mayakutty, may your "Thudakkam" be just the first step in a lifelong love affair with cinema.#Thudakkam
Written and Directed by Jude Anthany Joseph and Produced by Antony Perumbavoor, Aashirvad Cinemas#VismayaMohanlal
@antonyperumbavoor @aashirvadcine… pic.twitter.com/YZPf4zhSue— Mohanlal (@Mohanlal) July 1, 2025