breaking news
Vismaya Sri
-
హీరోయిన్గా స్టార్ హీరో కుమార్తె ఎంట్రీ.. ఇంతకీ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్‌గా వినిపించే పదమే. చాలామంది అగ్రతారల పిల్లలు కూడా సినిమానే కెరీర్‌గా ఎంచుకోవడం మనం ఎక్కువగా చూస్తుంటాం. వారి బాటలోనే నడుస్తూ ఇండస్ట్రీలో తమ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. అలా మరో స్టార్ హీరో కుటుంబం నుంచి వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూతురు విస్మయ అరంగేట్రానికి సిద్ధమైంది.మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ కథానాయికగా సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. తుడక్కం అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రానికి జూడే ఆంథానీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. జుడే ఆంథోని గతంలో సారాస్, 2018 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఆశీర్వాద్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. విస్మయ మోహన్ లాల్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు ఆశీర్వాద్ సినిమాస్‌కు ఎంతో గర్వంగా ఉందని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించింది. ఈ సంతోషకరమైన వార్తను మోహన్ లాల్ సైతం ట్వీట్ ద్వారా పంచుకున్నారు. తుడక్కం సినిమాపై నీ జీవితకాల ప్రేమకు ఇదే మొదటి అడుగు అంటూ రాసుకొచ్చారు.కాగా..విస్మయ సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ.. రచయితగా రాణిస్తోంది. రచయితగా ఆమె తన తొలి పుస్తకం 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్'ను 2021లో పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదల చేసింది. అంతేకాకుండా విస్మయ మార్షల్ ఆర్ట్స్ పట్ల కూడా నైపుణ్యం సాధించింది. థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.మరోవైపు విస్మయ సోదరుడు ప్రణవ్ మోహన్‌లాల్ సైతం జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం 'ఆది'మూవీతోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ప్రణవ్ ప్రస్తుతం డైస్ ఐరే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మోహన్ లాల్ విషయానికొస్తే ఈ ఏడాదిలో ఎంపురాన్-2తో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎంపురాన్'-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత తుడురుమ్ అనే మూవీతో అలరించారు. Dear Mayakutty, may your "Thudakkam" be just the first step in a lifelong love affair with cinema.#ThudakkamWritten and Directed by Jude Anthany Joseph and Produced by Antony Perumbavoor, Aashirvad Cinemas#VismayaMohanlal@antonyperumbavoor @aashirvadcine… pic.twitter.com/YZPf4zhSue— Mohanlal (@Mohanlal) July 1, 2025 -
బిగ్‌బాస్ 8: ఆ హీరోయిన్‌తో పాటు డ్యాన్సర్ కూడా!
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ వారం రోజుల్లో షురూ కానుంది. సింగర్, మోడల్, డ్యాన్సర్, యాక్టర్.. ఇలా విభిన్న రంగాల నుంచి కంటెస్టెంట్ల ఎంపిక చేపట్టారు. ఇప్పటికే రీతూ చౌదరి, విష్ణుప్రియ, సౌమ్య రావు, ఏక్నాథ్ హారిక, యష్మి గౌడ, అంజలి పవన్, యాంకర్ శేఖర్ భాషా, యాదమ్మరాజు దాదాపు ఖరారయ్యారని ప్రచారం జరుగుతోంది.డ్యాన్సర్..తాజాగా ఓ డ్యాన్సర్ పేరు తెరపైకి వచ్చింది. తనే నైనిక. డ్యాన్స్ రియాలిటీ షో ఢీలో పాల్గొని తన టాలెంట్ చూపించింది. ఈవిడ అచ్చ తెలుగమ్మాయి. అలాగే ఓ మలయాళ హీరోయిన్ సైతం షోలోకి వచ్చేస్తోందట.. తనే విస్మయ శ్రీ. చూడటానికి క్యూట్‌గా కనిపించే ఈ బ్యూటీ.. తెలుగులో మైల్స్ ఆఫ్ లవ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో, దిల్సే చిత్రాల్లో నటించింది. ప్చ్, ఫలితం లేదుఇన్ని సినిమాలు చేసినా విస్మయకు టాలీవుడ్లో అంతగా గుర్తింపు రావడం లేదు. ఇంతలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. దీనివల్ల జనాలకు మరింత దగ్గరవచ్చని భావించిందో ఏమో కానీ వెంటనే ఆఫర్ ఓకే చేసిందట. మరి ఈ బ్యూటీస్ షోలో ఏమేరకు మెప్పిస్తారో చూడాలి! -
‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’ మూవీ రివ్యూ
టైటిల్: కృష్ణగాడు అంటే ఒక రేంజ్ నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత దర్శకత్వం: రాజేష్ దొండపాటి సంగీతం: సాబు వర్గీస్ సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ ఎడిటర్: సాయి బాబు తలారి విడుదల తేది:ఆగస్ట్ 4, 2023 కథేంటంటే.. కృష్ణ(రిష్వి తిమ్మరాజు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి పెంపకంలో పెరిగి, పెద్దవాడయ్యాక మేనమామ సాయంతో ఊర్లోనే మేకలు కాస్తూ ఉంటాడు. ఎప్పటికైనా తండ్రి ప్రారంభించిన ఇంటిని పూర్తి చేయాలనేది కృష్ణ లక్ష్యం. మరోవైపు అదే ఊర్లో వరుసకు మరదలు అయ్యే సత్య(విస్మయ) కృష్ణని ఇష్టపడుతుంది. కృష్ణకి కూడా సత్య అంటే చాలా ఇష్టం. కానీ సత్య తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరు. మరోవైపు అదే గ్రామానికి చెందిన ఓ ధనవంతుడు, కామాంధుడు దేవా చూపు సత్యపై పడుతుంది. సత్య కారణంగా ఓసారి కృష్ణ, దేవా ఊరి జనాల మధ్య కొట్టుకుంటారు. ‘ఉండడానికి ఇల్లు కూడా దిక్కులేదు కానీ ప్రేమ కావాలట’అంటూ కృష్ణని అవమానిస్తాడు దేవ. దీంతో మూడు నెలల్లో ఇంటిని పూర్తి చేసి,సత్యను పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తాడు కృష్ణ. మరి కృష్ణ సొంతింటి కల నెరవేరిందా? తల్లికి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అప్పు చేసిన తీసుకొచ్చిన రూ.10 లక్షలు ఎవరు దొంగిలించారు? చివరకు ఊరి జనాలతో ‘కృష్ణగాడు అంటే ఒక రేంజ్’అని ఎలా అనిపించుకున్నాడు అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రమిది. లవ్‌స్టోరీతో పాటు కామెడీ, యాక్షన్ ఇలా అన్ని జానర్లను టచ్ చేశాడు దర్శకుడు రాజేష్ దొండపాటి. అయితే ఈ తరహా చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ.. కథనాన్ని కాస్త కొత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు. కృష్ణ తండ్రి చనిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత మేకల కాపరిగా హీరోని పరిచయం చేశారు. హీరో ఎంట్రీ సీన్ కూడా చాలా సహజంగా ఉంటుంది. సత్యతో ప్రేమలో పడ్డాక కథలో వేగం పుంజుకుంటుంది. కృష్ణ, సత్యల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. ఫస్టాఫ్ మొత్తం సత్య, కృష్ణల ప్రేమ చుట్టే తిరుగుతుంది. ఓ ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం చాలా ఎమోషనల్‌గా సాగుతూనే వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది. దోపిడీ ముఠాను హీరో కనిపెట్టిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్‌లో హీరో నుంచి మంచి ఎమోషన్స్‌ని రాబట్టుకున్నాడు దర్శకుడు. పేరున్న నటీనటులు లేకపోవడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కృష్ణ, సత్యల పాత్రల చుట్టే తిరుగుతుంది. మేకల కాపరి కృష్ణగా రిష్వి తిమ్మరాజు చక్కగా నటించాడు. తెరపై చూడడానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. అయితే తొలి సినిమా కావడంతో కొన్ని సన్నివేశాల్లో తడబడ్డాడు. సత్యగా విస్మయ తనదైన నటనతో ఆకట్టుకుంది. పల్లెటూరికి చెందిన చలాకీ అమ్మాయిగా ఆమె పాత్ర ఉంటుంది. లుక్స్ పరంగా తెరపై కాస్త బొద్దుగా కనిపించినా, అందంగా ఉంది. దేవా పాత్రపోషించిన నటుడు కూడా తన పాత్రకు న్యాయం చేశాడు.స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. పాటలు కథలో భాగంగా వస్తుంటాయి. వినసొంపుగా ఉంటాయి కూడా. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కొన్ని సిన్స్‌ని మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.