మోహన్ లాల్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’. తండ్రీ కొడుకుల మధ్య గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ ప్రేమ, విధి, ద్వేషం వంటి భావోద్వేగాలను మిళితం చేసి నందకిశోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్ణని, జుహి పరేఖ్ మెహతా నిర్మించారు.
ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది. సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా సక్సేనా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని మలయాళం, తెలుగులో ఏక కాలంలో చిత్రీకరించారు. ఈ రెండు భాషలతో పాటు హిందీ, కన్నడలోనూ విడుదల చేయనున్నారు.


