అయోధ్య వేడుక.. ఆహ్వానం అందింది: మోహన్‌బాబు | Mohan Babu Comments On Ayodhya Ram Mandir Inauguration Event, Details Inside - Sakshi
Sakshi News home page

Mohan Babu On Ayodhya Ram Mandir: అయోధ్య నుంచి పిలుపు.. భద్రత కల్పిస్తామన్నారు.. కానీ..

Published Sat, Jan 20 2024 12:31 PM

Mohan Babu Comments on Ayodhya Ram Mandir - Sakshi

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 22న శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనుండగా ఇందుకోసం రాజకీయ, సినీ, క్రీడా రంగంలోని తదితర సెలబ్రిటీలకు ఆహ్వానాలు పంపారు. తాజాగా తనకూ ఆహ్వానం అందిందని చెప్తున్నాడు డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు. శనివారం నాడు ఫిలిం నగర్‌లో అయోధ్యలో జరగబోయే ప్రాణప్రతిష్టపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. 'ఫిలిం ఇండస్ట్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. ఫిలిం నగర్‌లోని దైవ సన్నిధానం, చిత్రపురి కాలనీ వంటివి ఇచ్చింది. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అద్భుతమైన దేవాలయం. ఇక్కడ అన్ని దేవతా మూర్తులున్నాయి. విశిష్టమైన పూజలు జరుగుతాయి. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభాన్ని ఎంతో వేడుకగా జరుపుతున్నారు. ఈ వేడుక కోసం నాకు ఆహ్వానం అందింది. సెక్యూరిటీ ఇస్తాము అన్నారు. అయినా భయపడి వెళ్లట్లేదు. కానీ ఇక్కడి దైవ సన్నిధానంలో ఈ నెల 14 నుంచి 22 వరకు(రాములవారి ప్రాణప్రతిష్ట పూర్తయ్యేవరకు) అనేక పూజా కార్యక్రమాలు చేస్తున్నాము' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ఆయన మంచి పర్ఫార్మర్‌.. తనతో నటించేందుకు ఎదురు చూస్తున్నా..

Advertisement
 
Advertisement