MLA Gudem Mahipal Reddy Launched Tarakasura 2 Movie - Sakshi
Sakshi News home page

‘తారకాసుర’సిరీస్ విజయం సాధించాలి: ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి

Jul 25 2023 5:11 PM | Updated on Jul 25 2023 5:29 PM

MLA Gudem Mahipal Reddy Says Tarakasura Movie - Sakshi

కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే... ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న "తారకాసుర -2" చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది.

పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు  ఎమ్మెల్యే మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా... జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!!

"తారకాసుర సిరీస్"తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ "శ్రీజ మూవీస్" బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. "తారకాసుర-2" చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement