చిరంజీవి సతీమణికి అరుదైన గౌరవం | Megastar Wife Konidela Surekha appointed as yadadri Board member | Sakshi
Sakshi News home page

Konidela Surekha: చిరంజీవి సతీమణికి అరుదైన గౌరవం

Jul 1 2026 3:47 PM | Updated on Jul 1 2026 3:54 PM

Megastar Wife Konidela Surekha appointed as yadadri Board member

మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఎం. సత్యనారాయణ రెడ్డిని పాలకమండలి ఛైర్మన్‌గా నియమించిన ప్రభుత్వం.. 11 మందితో కలిపి పాలకవర్గాన్ని ప్రకటించింది. వీరంతా ఈ పదవుల్లో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

గతంలో యాదగిరిగుట్ట దేవస్థానానికి 2009 సంవత్సరం వరకు సాధారణ పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత ఆలయ ఈవోలతోనే నడిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరిగింది. అయితే పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు కొనసాగుతూ వచ్చాయి. తాజాగా పాలకమండలి ఏర్పాటు చేశారు.

చైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి..

యాదగిరిగుట్ట దేవస్థానం (వైటీడీ) బోర్డు చైర్మన్‌గా ఎం.సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎంఎస్‌ఎన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి ఫార్మారంగంలో సేవలందిస్తున్నారు. ఒక సాధారణ కెమిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ఫార్మా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement