త్వరలోనే మళ్లీ కలుస్తా.. మెగాస్టార్‌ పోస్ట్ వైరల్! | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: మెగాస్టార్ హాలీడే ట్రిప్.. ఎక్కడికో తెలుసా?

Published Wed, Feb 14 2024 11:58 AM

Megastar Chiranjeevi Off To USA For Vacation Trip With Wife - Sakshi

భోళాశంకర్ తర్వాత మెగాస్టార్‌ నటిస్తోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీ యూవీ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా కోసమే మెగాస్టార్‌ తీవ్రమైన కసరత్తులు చేశారు. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.

అయితే ఇవాళ వాలెంటైన్‌ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అంతే కాకుండా తన భార్య సురేఖతో కలిసి హాలిడే ట్రిప్‌కు యూఎస్‌ఏ వెళ్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ త్వరలోనే విశ్వంభర షూట్‌లో కలుస్తానంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరు దంపతులకు వాలెంటైన్స్‌ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement