
బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్.. వచ్చే నెల 7న ప్రారంభం కానుంది. అయితే అంతకంటే ముందే ఈసారి సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష' పేరుతో ఓ పోటీ పెడుతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుకాగా.. ఎంపిక ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ గేమ్ షోకు శ్రీముఖి యాంకర్ కాగా.. బిందుమాధవి, అభిజిత్, నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే తొలి ప్రోమోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 22 ఏళ్ల కొడుకు.. అయినా సరే రెండో పెళ్లికి నటి రెడీ)
అగ్నిపరీక్షలో 45 మంది సామాన్యులు పాల్గొనబోతున్నారు. వీళ్లలో యువతీ యువకులు, సోషల్ మీడియాలో కాస్త ఫేమ్ ఉన్న వాళ్లు, ముసలి వాళ్లు, కాళ్లు లేని దివ్యాంగులు, ముఖానికి మాస్క్ పెట్టుకున్న వ్యక్తులు, హిజ్రా.. ఇలా అన్ని రకాల వ్యక్తులు భాగం కానున్నారు. వీళ్ల నుంచి చివరగా ముగ్గురుని ఎంపిక చేసి, వాళ్లని సీజన్‌లో ఆడిస్తారు.
ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 5 వరకు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష షో జరగనుంది. ప్రతిరోజు గంట పాటు ప్రసారం చేస్తారు. ఇందులో భాగంగా పాల్గొన్న సామాన్యులకు పోటీలు పెట్టి చివరకు విజేతల్ని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రోమోలోనే 'నేను ఆడ నవదీప్‍ని' అని మహిళా బాడీ బిల్డర్ అనడం.. వయసు తట్టుకుంటా.. ఉపవాసం ఉంటా.. ఏది పెట్టినా తింటా.. ఎలిమినేట్ చేయాలని చూస్తే ఊరుకోను అని ఓ ముసలామె అనడం ఆసక్తికరంగా ఉన్నాయి.
(ఇదీ చదవండి: చిరుతో సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత)