ఇదే కదా నిజమైన ఆనందం: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్! | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: ఇంతకంటే అవార్డ్ ఏముంటుంది?: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!

Published Mon, Feb 19 2024 2:55 PM

Megastar Chiranjeevi Gets Huge Honour Form USA Fans In Tour - Sakshi

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా లియో భామ త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

కాగా.. ఇటీవలే మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత పురస్కారం చిరంజీవిని వరించడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు అభినందనలు తెలిపారు. 

తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్‌కు ఘనమైన స్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించారు. లాస్‌ఎంజిల్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన చిరుపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. 

చిరంజీవి మాట్లాడుతూ..'పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు ఆనందం, సంతోషం కలిగింది. అవార్డ్‌ వచ్చినందుకు నాకంటే మీరు బాగా ఆనందపడుతున్నారు. నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానం వెల కట్టలేనిది. ఇంతమంది ఆనందంగా ఉన్నారంటే.. ఇదే కదా అసలు సిసలైన ఆనందం. ఇంతకంటే అవార్డ్ ఇంకా ఏముంటుంది' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. 


 

Advertisement
 
Advertisement