Megastar Chiranjeevi Launched Samajavaragamana Movie Trailer, Deets Inside - Sakshi
Sakshi News home page

కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు!

Jun 26 2023 3:49 AM | Updated on Jun 26 2023 9:26 AM

Megastar Chiranjeevi Launched Samajavaragamana Trailer - Sakshi

‘‘బాక్సాఫీస్‌ బాలు ఫ్యామిలీ మేము. డబ్బులు అతని దగ్గర తీసుకోండి’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘సామజ వరగమన’ సినిమా ట్రైలర్‌. శ్రీ విష్ణు హీరోగా ‘వివాహభోజనంబు’ ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

‘వాడి దృష్టిలో ఫ్యామిలీ మెంబర్స్‌ అంటే.. కేజీఎఫ్‌లో బానిసల్లా చూస్తాడు’ (వీకే నరేశ్‌), ‘ఎప్పుడైనా ఏదైనా పనికొచ్చే పని చేశావా.. చెత్త నుంచి కూడా కరెంట్‌ తీస్తున్నారు’ (శ్రీ విష్ణు) అనే డైలాగ్స్‌ ట్రైలర్‌లో ఉన్నాయి. ‘‘అమ్మాయిల పట్ల విరక్తి పెంచుకునే ఓ మధ్యతరగతి కుర్రాడు బాలు. అయితే రిచ్‌ లైఫ్‌స్టైల్‌ కోరుకునే ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ’’ అనిచిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, సహనిర్మాత: బాలాజీ గుత్తా.  

Advertisement
 
Advertisement
Advertisement