మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?.. వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్! | Sakshi
Sakshi News home page

Varun Tej: లావణ్య కాకుండా ఆ హీరోయిన్‌ అంటే చాలా ఇష్టం: వరుణ్ తేజ్

Published Tue, Feb 6 2024 9:34 PM

Mega Hero Varun Tej Comments On Operation valentaine Movie Goes Viral - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రోడక్షన్స్, సందీప్‌ ముద్దా రినైసన్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా  తెలుగు, హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా రానుంది. ఈ మూవీని మార్చి 1 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ రూపొందించారు. ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా కనిపించనుండగా.. హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్‌ లుక్ పోస్టర్లు ఆడియన్స్‌లో భారీ అంచనాలు పెంచేశాయి. జనవరి 26న రిపబ్లిక్‌ డేకు ముందు దేశభక్తి జ్వాలని రగిలించే ఫస్ట్‌ సింగిల్‌ ‘వందేమాతరం’ రిలీజ్ చేశారు. తాజాగా  ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'గగనాల తేలేను నీ ప్రేమలోన' అనే పాటను అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మల్లారెడ్డి కాలేజ్‌ విద్యార్థులతో చిత్ర బృందం ఇంటరాక్షన్‌ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌లో వరుణ్‌తేజ్‌ ఆసక్తిక ప్రశ్న ఎదురైంది. మీ ఫేవరేట్ హీరోయిన్ ఎవరు? అంటూ విద్యార్థులు వరుణ్‌తేజ్‌ను అడిగారు. దీనికి సమాధానం ఇస్తూ..'నేను నా ఫేవరేట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నా. ఏదైనా మంచి కథ వస్తే ఇద్దరం కలిసి చేస్తాం. మా ఇద్దరిలో మొదట ప్రపోజ్ చేసింది నేనే' అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా లావణ్య కాకుండా తనకు సాయిపల్లవి అంటే అభిమానం అని తెలిపారు. 

అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.. 'ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యంలో  తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే అనుకుంటా. దేశం కోసం ఏది చేసినా గొప్పగానే ఉంటుంది. ఈ సినిమా మీ అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. నేను చేయబోయే తర్వాతి మాస్‌ మూవీ  మట్కా. గద్దల కొండ గణేష్‌ తరహాలో నా పాత్ర ఉండనుంది.' అని అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement