
ఏ రంగంలోనైనా కలలు కనడంతో పాటూ వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. అలా తన కల ఎప్పటికైనా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు నటి మీనాక్షీ దినేష్. మలయాళంలో 18 ప్లస్, రెట్టా వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించిన తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్న ఈ కేరళా బ్యూటీ లవ్ మ్యారేజ్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. నటుడు విక్రమ్ ప్రభు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సక్సెస్‌పుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో మీనాక్షీ ధినేష్ నటన పలువురిని ఆకట్టుకుంది. సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నటి మీనాక్షీ దినేష్ తన భావాలను పంచుకున్నారు. తెలుగులో కూడా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై గోపీచంద్ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఆమె ఛాన్స్ దక్కించుకుంది.

లవ్ మ్యారేజ్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల నుంచి తనకు లభిస్తున్న అభినందనలు, ఆదరాభిమానాలు చాలా సంతోషాన్నిస్తున్నాయని మీనాక్షీ అన్నారు. ఈ చిత్రంలో నటించడం ఒక కొత్త పరిణాన్ని ఆవిష్కరించుకోవడానికి తనకు లభించిన అవకాశంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో తనను హీరోయిన్‌గా ఎంపిక చేసిన యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. పలు ఛాలెంజ్‌తో కూడిన కథాపాత్రల్లో నటించి తనకుంటై ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాలని కోరుకుంటున్నాననీ, స్టీరియో భాణిని బద్దలు కొట్టి నటనకు అవకాశం ఉన్న బలమైన పాత్రల్లో నటించాలన్నది తన ఆశ అన్నారు.
కాగా తనకు తమిళంలో సూర్య నటనకు తాను వీరాభిమానినని చెప్పారు. ఆయన నటనను తాను చాలా కాలంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో చిత్రంలోనూ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్న ఆయన నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. సూర్యకు జంటగా నటించాలన్నది తన కల అన్నారు. దాన్ని ఒక రోజు కచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కాగా ప్రతిభావంతమయిన నటన, మంచి కథా చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి మీనాక్షీ దినేష్ త్వరలోనే దక్షిణాది సినిమాలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకంటారని భావించవచ్చు.