Matarani Mounamidi Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Matarani Mounamidi Trailer: అనుకోని సంఘటనలతో 'మాటరాని మౌనమిది'.. ట్రైలర్‌ రిలీజ్‌

Jul 31 2022 8:42 PM | Updated on Jul 31 2022 8:58 PM

Matarani Mounamidi Movie Trailer Released - Sakshi

రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందింది ఈ సినిమా.

Matarani Mounamidi Movie Trailer Released: రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ రూపొందిస్తున్న సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మల్టీ జోనర్ గా రూపొందింది ఈ సినిమా. తుది హంగులు అద్దుకుంటున్న "మాటరాని మౌనమిది" సినిమా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అయితే టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ ఫేస్ మాస్క్‌లతో ఉన్న వ్యక్తులు ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. దీంతో ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోల ఆశీర్వాదం ఉందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 

"మాటరాని మౌనమిది" మూవీ ట్రైలర్ చూస్తే లవ్, మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. స్నేహితుడిలా ఉండే బావ ఇంటికి వెళ్తాడు హీరో. అక్కడ అతనికి మాటలు రాని క్లాసికల్ డాన్సర్ పరిచయం అవుతుంది. ఆ అమ్మాయితో రిలేషన్ ఏర్పడుతుంది. ఒకరోజు హీరో బావ ఇంట్లో అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఏంటి, అంతు చిక్కని అదృశ్య శక్తి ఏం చేసింది అనేది ట్రైలర్ లో ఇంట్రెస్ట్  క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, లిరికల్ పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా కొత్తగా ఉంటుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచెలా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement