చిన్నారి దేవత వచ్చింది  | Sakshi
Sakshi News home page

చిన్నారి దేవత వచ్చింది 

Published Sun, Apr 14 2024 12:36 AM

Manchu Manoj And Mounika Blessed With Baby Girl - Sakshi

‘‘ఆ దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో హ్యాపీగా ఉంది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు మంచు లక్ష్మి. మంచు మనోజ్‌ భార్య మౌనిక శనివారం కుమార్తెకు జన్మనిచ్చారు.

‘‘మేం పాపను ఎమ్‌ఎమ్‌ పులి (మంచు మనోజ్‌ పులి అయ్యుండొచ్చు) అని ముద్దుగా పిలుస్తున్నాం’’ అని కూడా లక్ష్మి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. మనోజ్‌ నటిస్తున్న తాజా యాక్షన్‌ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ చిత్రం గ్లింప్స్‌ని మనోజ్‌ పుట్టినరోజు సందర్భంగా మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement