Manchu Lakshmi: ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు: మంచు లక్ష్మి

Manchu Lakshmi Emotional Video About Her Daughter Vidya Went To School - Sakshi

Manchu Lakshmi Emotional Video: మంచు నట వారసురాలు మంచు లక్ష్మీ.. పలు రకాలుగా ప్రతిభను చాటుకుంటూ.. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా, యూట్యూబర్‌గా ఇలా ఎన్నో రకాలుగా తన టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులను అలరిస్తుంది ఈ విలక్షణ నటి. ఫన్నీ వీడియోలను, ఫోటోలను షేర్‌ చేస్తూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తుంది. ఇటీవల కలరి విద్య కూడా నేర్చుకుంటున్న మంచు లక్ష్మి తాజాగా ఓ ఎమోషనల్ వీడియో షేర్‌ చేసింది. 

తన కూతురు విద్యా నిర్వాణను స్కూల్‌కు పంపడం చాలా కష్టంగా ఉందని మంచు లక్షి కన్నీరు పెట్టుకుంది. సోమవారం (జులై 25) విద్యాను పాఠశాలలో దింపి వచ్చిన తర్వాత ఇన్‌స్టా గ్రామ్‌ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేసింది. ఈ ఇన్‌స్టా స్టోరీ వీడియోలో 'కరోనా లాక్‌డౌన్‌ వల్ల స్కూల్స్‌ మూసేసినప్పుడు పిల్లలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ సమయంలో విద్యాను ఎలా భరించాలి? అని అనుకున్నా. రెండేళ్ల నుంచి విద్యా ఇంట్లోనే ఉండటంతో మా ఇద్దరి మధ్య తల్లి కూతుళ్ల ప్రేమానుబంధం ఎంతో పెరిగింది. చాలా రోజుల తర్వాత మళ్లీ తనను స్కూల్‌కి పంపి వస్తుంటే ఏదో తెలియని బాధ. విద్యాకు దూరంగా ఉండటం ఇంత కష్టంగా ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇక త్వరలోనే దీనికి అలవాటుపడతానని అనుకుంటున్నా' అని చెప్పుకొచ్చింది. 

చదవండి: పరువు పోయింది, చనిపోవాలనుకున్నా: సింగర్‌ కల్పన
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌..
ఫ్యాన్స్‌ గుర్తుపట్టడంతో భయపడి పరిగెత్తిన స్టార్ హీరో..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top