Know Why Singer Kalpana Wanted To Commit Suicide, Details Inside - Sakshi
Sakshi News home page

Singer Kalpana: ఇండస్ట్రీలో చాలా మాటలన్నారు.. వారికి ఫిర్యాదు కూడా చేశారు: సింగర్‌ కల్పన

Published Mon, Jul 25 2022 10:38 AM

Singer Kalpana Says She Wants To Commit Suicide - Sakshi

ప్రముఖ నేపథ్యగాయనిగా పేరు సంపాందించుకుంది కల్పన (Singer Kalpana). తన మధురమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడింది. సంగీతంపై అమితమైన మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించింది. శాస్రీయ, జానపద, కర్ణాటక, హిందూస్థానీ, పాశ్చాత్య సంగీతం ఇలా ఏ జోనర్‌లోనైనా అవలీలగా కల్పన ఆలపిస్తుంది. 'మనోహరం' సినిమాలో మంగళ గౌరి అనే సాంగ్‌తో ఫుల్‌ టైమ్‌ ప్లేబ్యాక్ సింగర్‌గా మారింది. ఎమ్‌ఎస్‌ విశ్వనాథన్, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, మణిరత్నం, కెవి, మహదేవన్‌, ఎస్పీ బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖ గాయకులు, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో కలిసి ఆమె పనిచేశారు. వరల్డ్‌వైడ్‌గా 3 వేల స్టేజ్‌ షోలు ఇచ్చి రికార్డు క్రియేట్‌ చేసిన కల్పన బిగ్‌బాస్‌లో కూడా అలరించింది. 

అయితే ఎంతో సక్సెస్‌ సాధించిన కల్పన జీవితంలో కూడా ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుంది. ''25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. అనేక వేధింపులతో వివాహబంధం 2010లో ముగిసిపోయింది. ఒక పాప ఉంది. ఉద్యోగం లేదు. అన్నీ కోల్పోయిన నేను ఆఖరికి చనిపోవాలనుకున్నా. కానీ సింగర్‌ చిత్రమ్మ ధైర్యం చెప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అంటూ నన్ను మార్చేందుకు ప్రయత్నించారు. ఇక్కడ పోటీ జరుగుతోంది.. అందులో పాల్గనమని ఎంకరేజ్‌ చేశారు. 

చదవండి: అప్పుడెందుకు గుర్తుకు రాలేదు.. చిరుపై అమీర్ ఖాన్‌ వ్యాఖ్యలు
తన సినిమానే చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌..

సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటికి నాకు మలయాళం అస్సలు తెలియదు. కసితో వెళ్లాను. నా కుమార్తె కోసం విల్లా గెలవాలనుకున్నాను. ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు ఫిర్యాదు కూడా చేశారు. ఎంతో కష్టపడి ఆ పోటీ గెలుపొందా. ఈ విషయంలో ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశాను. ఆ గెలుపు తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది'' అని ఇటీవల తెలిపారు సింగర్ కల్పన. 

చదవండి: నూలుపోగు లేకుండా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ

Advertisement
Advertisement