టీవీ నటుడి ఆత్మహత్యాయత్నం

మలయాళ సీరియల్ నటుడు ఆదిత్య జయన్ ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం సాయంత్రం కారులో కూర్చున్న సమయంలో తన చేతి నరాలున కట్ చేసుకున్నాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే అతడిని త్రిచూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా మణికట్టును కోసుకోవడానికి ముందు అతడు అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని వెల్లడించారు.
కాగా బుల్లితెర నటి అంబిలి దేవి తన భర్త ఆదిత్య జయన్ మీద తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అతడు తనను మోసం చేశాడంటూ ఈ మధ్యే ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆదిత్య తనకు విడాకులివ్వాలని బలవంతపెడుతున్నాడని, చంపడానికి కూడా వెనకాడనని బెదిరిస్తున్నాడని పేర్కొంది. అయితే భార్య అంబిలి దేవి చేసిన ఆరోపణలను ఆదిత్య జయన్ ఖండించాడు. వ్యక్తిగత విబేధాలను దృష్టిలో పెట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చొద్దని సూచించారు. ఇలా గొడవ జరుగుతున్న సమయంలోనే ఆయన సూసైడ్‌కు యత్నించడం సంచలనంగా మారింది.
కాగా వీళ్లిద్దరూ బుల్లితెర మీద 'సీత' అనే సీరియల్‌లో దంపతులుగా నటించారు. అదే సమయంలో వీరు ప్రేమలో పడగా 2019లో పెళ్లి పీటలెక్కారు. వీరికి అర్జున్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కాగా ఆదిత్య ప్రస్తుతం ఎంటె మాతవు, సీతాకల్యాణం సీరియల్స్‌లో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చదవండి: మహిళతో సంబంధం, నాలుగో భార్య అంబిలి దేవికి విడాకులు!
హీరోయిన్ లవ్ ఎఫైర్.. అడ్డొచ్చిన తమ్ముడిని ముక్కలుగా నరికి..