
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ నటి కనకలత కన్నుమూశారు. తిరువనంతపురంలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నారు. దీంతో కోలుకోలేక మరణించారు. కాగా.. 22 ఏళ్లకే పెళ్లి చేసుకున్న కనకలత.. 16 ఏళ్ల తర్వాత తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమెకు ఎలాంటి సంతానం లేకపోవడంతో 34 ఏళ్లుగాతన సోదరి విజయమ్మతో కలిసి ఉంటోంది.
కాగా.. కనకలత మలయాళం, తమిళ సినిమాలు, సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. దాదాపు రెండు భాషల్లో 360కి పైగా చిత్రాలు చేశారు. యాత్రామొళి, గురు, కిలుకిల్ పంబరం, పార్వతీ పరిణయం, తుంపోలి కడపురం, అతిర కన్మణి, ఎఫ్‌ఐఆర్, ఆకాశ గంగ, దోస్త్, నెమలి, మంత్రమోతీరం, కౌరవులు, కార్య, జాగురా, రాజు లాంటి సినిమాలు చేసింది. కనకలత చివరిసారిగా ‘పూక్కాళం’, ‘మూడు రోజులు సినిమాల్లో నటించింది. ఆమెకు చిత్ర పరిశ్రమ నుండి ఆఫర్లు వచ్చనప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటనకు విరామం తీసుకుంది. ఆమెకు మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ), ఫిల్మ్ అకాడమీ ఆర్థిక సాయంతో చికిత్స తీసుకున్నారు.