అల వైకుంఠపురములో నటుడి ఇంట పెళ్లి సందడి.. గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌! | Malavika Jayaram gets engaged in a private ceremony | Sakshi
Sakshi News home page

Malavika: ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న స్టార్ నటుడి కూతురు!

Dec 8 2023 4:47 PM | Updated on Dec 8 2023 5:06 PM

Malavika Jayaram gets engaged in a private ceremony - Sakshi

మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్‌తో మాళవిక ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్‌ గురించి అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. 

కాగా.. ఆమె తల్లిదండ్రలైన జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే. ఆమె తండ్రి జయరాం టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్‌కుమార్‌ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్‌-1లోనూ కనిపించారు.

అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్‌ ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్‌గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement