Actress Malashree Daughter Radhana Ram Signs Debut Film With Darshan - Sakshi
Sakshi News home page

Malashree: కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేసిన నటి మాలా శ్రీ

Aug 7 2022 7:12 PM | Updated on Aug 8 2022 8:23 AM

Malashree Daughter Radhaan Ram Signs Her Debut Project Opposite Darshan - Sakshi

ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్‌ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్‌తో కలిసి  D56 వర్కింగ్ టైటిల్‌తో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు.

బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్‌ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది.

ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్‌ నా సినిమాతో ప్రొడక్షన్‌లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది.  మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది.

ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement