రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ టీజ‌ర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Maker Announced Rajinikanth Annaatthe Teaser Release Date | Sakshi
Sakshi News home page

Annaatthe: రజనీకాంత్‌ ‘అన్నాత్తే’ టీజ‌ర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Oct 12 2021 11:07 AM | Updated on Oct 12 2021 11:08 AM

Maker Announced Rajinikanth Annaatthe Teaser Release Date - Sakshi

సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’...

సూపర్‌ స్టార్‌ ర‌జనీకాంత్కి ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవ‌ల విడుదలైన ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్స్, సాంగ్స్ ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం.


సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధిమారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని అక్టోబర్‌ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌. ఇప్పటికే భారీ అంచనాలు ఉండడంతో ఇది కచ్చితంగా రికార్డులు తిరగ రాస్తుందని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. కీర్తిసురేశ్‌, మీనా, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి డి. ఇమ్మన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ మూవీ నవంబర్‌ 4న థియేటర్స్‌లో విడుదల కానుంది.

చదవండి: అక్టోబర్‌ 4న ఎస్పీ బాలు ఆలపించిన చివరి పాట

Advertisement
 
Advertisement
Advertisement