Annaatthe: అన్నాత్తేకి బాలు పాట

Annaatthe First SIngle Song By SP Balasubrahmanyam To Be Out On 4th October - Sakshi

హీరో రజనీకాంత్, ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీబీ) కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ పాటలు శ్రోతలను అలరించాయి. వీరి కాంబినేషన్‌లో మరో పాట ‘అన్నాత్తే’ చిత్రం నుంచి ఈ నెల 4న శ్రోతల ముందుకు రానుంది. ‘‘రజనీ గారి ఇంట్రడక్షన్‌ సాంగ్‌ అంటేనే స్పెషల్‌. ఈ పాటను ఎస్పీబీగారు పాడితే ఇంకా ప్రత్యేకం. ఎస్పీబీ వంటి లెజెండ్‌తో ఓ పాటను రికార్డు చేయడం నా లక్‌’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు ఇమ్మాన్‌.

మరి.. ఎస్పీబీ పాటకు అన్నాత్తే ఆట ఏ రేంజ్‌లో ఉంటుందనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ సినిమాలో రజనీకాంత్​తో పాటు ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top