
హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది . శంషాబాద్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది.
ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరా మెన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాక మరికొంత మంది ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం కలిగిందని తెలుస్తోంది.
