Mahesh Babu Speech At Super Star Krishna Pedda Karma - Sakshi
Sakshi News home page

Mahesh Babu : సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కర్మ.. మహేశ్‌ బాబు ఎమోషనల్‌

Nov 27 2022 1:34 PM | Updated on Nov 27 2022 2:46 PM

Mahesh Babu Speech At Super Star Krishna Pedda Karma - Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమం హైదరాబాద్‌లోని జేఆర్సీ, ఎన్‌ కన్వెన్షన్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ కుటుంబసభ్యులతో పాటు వేలాది అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌ బాబు మాట్లాడుతూ.. నాన్న నాకు ఎన్నో ఇచ్చారు. వాటిలో గొప్పది.. మీ అభిమానం. దానికి ఆయనకు నేను రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. మీ గుండెల్లో ఉంటారు.

ఆయన ఎప్పుడూ మనమధ్యే ఉంటారు.మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ మహేశ్‌  ఎమోషనల్‌ అయ్యారు. ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement