ప్రస్తుతం ఎక్కడ చూసినా మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ హడావుడి గురించే డిస్కషన్. హైదరాబాద్ శివారులో ఈ కార్యక్రమం భారీగానే ప్లాన్ చేశారు. అభిమానులతో పాటు వేలాదిమంది దీన్ని వీక్షిస్తున్నారు. అయితే ఈవెంట్ ప్రారంభంలోనే మూవీ టైటిల్ ఏంటనేది ప్రకటించేశారు. గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే 'వారణాసి' అని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్ వీడియోని ఈవెంట్ స్క్రీన్ పై ప్రసారం చేశారు.
టైటిల్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. గత కొన్నిరోజుల నుంచి రుద్ర, వారణాసి.. ఇలా పలు టైటిల్స్ వినిపించాయి. వీటిలో ఏది పెడతారా అనే డిస్కషన్ అయితే నడిచింది. ఫైనల్‌గా రాజమౌళి 'వారణాసి' అనే పేరుకే కట్టుబడి ఉన్నట్లు ఇప్పుడీ వీడియోతో క్లారిటీ వచ్చేసింది.
ఇందులో మహేశ్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రియాంక చోప్రా, మందాకిని పాత్రలో.. పృథ్వీరాజ్ సుకుమారన్, కుంభ అనే విలన్‌గా కనిపిస్తాడు. వీళ్లు ముగ్గురు కాకుండా ఇంకెవరెవరు ఉన్నారనేది వీడియోలో రివీల్ చేస్తారేమో చూడాలి?


