ఆకట్టుకుంటున్న 'మాయే మాయే' లిరికల్‌ సాంగ్‌.. విన్నారా? | Maaye Maaye Lyrical Song From Nenu Student Sir Is Out Now | Sakshi
Sakshi News home page

Nenu Student Sir : ఆకట్టుకుంటున్న 'మాయే మాయే' లిరికల్‌ సాంగ్‌.. విన్నారా?

Dec 13 2022 8:36 AM | Updated on Dec 13 2022 9:50 AM

Maaye Maaye Lyrical Song From Nenu Student Sir Is Out Now - Sakshi

యువ హీరో బెల్లంకొండ గణేశ్‌,అవంతిక దస్సానీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’  రాఖీ ఉప్పలపాటి డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదల చేసిన మాయే మాయే సాంగ్ ప్రోమో మ్యూజిక్‌ లవర్స్‌ ను ఇంప్రెస్ చేస్తూ సాగుతుంది. తాజాగా మాయే మాయే ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్.

హీరోహీరోయిన్లు గణేశ్‌, అవంతిక సాగే జర్నీ నేపథ్యంలో వచ్చే ఈ పాట సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తునడంలో ఎలాంటి సందేహం లేదు. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సాంగ్ లిరికల్‌ వీడియో లింక్‌ను షేర్ చేశాడు. ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా.. కపిల్‌ కపిలన్‌, మహతి స్వరసాగర్ ఈ సాంగ్ పాడారు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని హీరోయిన్ తండ్రి అర్జున్‌ వాసుదేవన్‌గా అనే పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించనుండగా..సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ‘నాంది’ ఫేం సతీశ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. నేను స్టూడెంట్‌ సర్‌ చిత్రానికి మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో శ్రీకాంత్ అయ్యంగార్‌, చరణ్‌ దీప్‌, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement