'మాత్రు' సినిమా పోస్టర్‌ లాంచ్‌ చేసిన విజయేంద్ర ప్రసాద్ | Maathru Movie Poster Launched By Vijayendra Prasad | Sakshi
Sakshi News home page

'మాత్రు' సినిమా పోస్టర్‌ లాంచ్‌ చేసిన విజయేంద్ర ప్రసాద్

May 9 2024 9:14 PM | Updated on May 9 2024 9:14 PM

Maathru Movie Poster Launched By Vijayendra Prasad

సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్‌గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ 'మాత్రు'. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు.

ప్రధాన తారాగణం అంతా ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై చాలా ఆసక్తిని కలిగించింది. అలీ, దేవి ప్రసాద్, ఆమని, రవి కాలే, నందిని రాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నారు. రాహుల్ శ్రీవాస్తవ్ డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి సత్యనారాయణ ఎడిటర్. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. త్వరలోనే మేకర్స్ రిలీజ్ తేదీని ప్రకటించనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement