Maa Nanna Naxalite : ‘ఒసేయ్‌ రాములమ్మ’ గుర్తొచ్చింది | Maa Nanna Naxalite Movie To Release On 8th July | Sakshi
Sakshi News home page

Maa Nanna Naxalite : ‘ఒసేయ్‌ రాములమ్మ’ గుర్తొచ్చింది

Jul 5 2022 8:02 AM | Updated on Jul 5 2022 8:49 AM

Maa Nanna Naxalite Movie To Release On 8th July - Sakshi

గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. పి. సునీల్‌ కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్‌ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్‌ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘మాతృదేవోభవ’ చిత్రం చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో ‘మా నాన్న నక్సలైట్‌’ చూశాక అంతే అనుభూతికి లోనయ్యాను’’ అన్నారు. 

‘‘ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తుంటే దాసరి  నారాయణరావుగారు తీసిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ చిత్రం గుర్తుకు వచ్చింది’’ అన్నారు దర్శకుడు రేలంగి నరసింహారావు. ‘‘నా తండ్రికి ఇచ్చే సెల్యూట్, నా కొడుకుకి ఇచ్చే గిఫ్ట్‌ ఈ సినిమా’’ అన్నారు సునీల్‌ కుమార్‌ రెడ్డి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, నటుడు కాశీ విశ్వనాథ్, నిర్మాత ప్రసన్న కుమార్, లిరిక్‌ రైటర్‌ రవీంద్ర బాబు, నటుడు కృష్ణ, నటి రేఖా నిరోషా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి , కెమెరా: ఎస్‌వి శివరామ్‌.     

Advertisement
 
Advertisement
Advertisement