అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ

MAA Elections 2021: Hema Gives Clarity On Shivabalaji Issue - Sakshi

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద  శివబాలాజీ చేయి కొరకడంపై నటి హేమ క్లారిటీ ఇచ్చింది. తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చేయి అడ్డుగా పెట్టాడని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ  చెప్పుకొచ్చారు. దాని వెనక తనకు ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ప్రస్తుతం పోలింగ్‌ చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శివబాలాజీ కూడా హేమ చేయి కొరకడాన్ని తెలిగ్గా తీసుకున్నాడు.

అనుకోకుండా అలా జరిగిపోయిందన్నారు. తనకు బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని, పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్న వ్యక్తిని పట్టుకోబోతున్న క్రమంలో వాగ్వాదం జరిగిన మాట వాస్తవమనేనని శివబాలాజీ చెప్పారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top