రోడ్స్‌ బ్లాకు...  | The lyrical video of the song from the movie Jelebi is released | Sakshi
Sakshi News home page

రోడ్స్‌ బ్లాకు... 

Jul 29 2023 12:56 AM | Updated on Jul 29 2023 12:56 AM

The lyrical video of the song from the movie Jelebi is released - Sakshi

‘ఆకు పాకు ఇస్తరాకు.. ఆల్‌ సైడ్స్‌ రోడ్స్‌ బ్లాకు..’ అంటూ సాగే పాట ‘జిలేబి’ చిత్రంలోనిది. ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’, ‘మన్మథుడు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె. విజయభాస్కర్‌ కొంత గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన చిత్రం ఇది. శ్రీ కమల్, శివానీ రాజశేఖర్‌ జంటగా గుంటూరు రామకృష్ణ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాలోని ‘ఆకు పా కు..’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌  చేశారు. సంగీత దర్శకుడు మణిశర్మ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాహుల్‌ సిప్లిగంజ్‌ పా డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement