యూత్‌ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ | Manaswini Bala Bommala Kokoroko Movie Details | Sakshi
Sakshi News home page

యూత్‌ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ

Jan 17 2026 7:38 PM | Updated on Jan 17 2026 7:55 PM

Manaswini Bala Bommala Kokoroko Movie Details

టాలీవుడ్‌లోకి యంగ్‌ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్‌గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది. ఈ మూవీ నుంచి తాజాగా ప్రత్యేకమైన పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్‌ గురించి ప్రశంసలు వస్తున్నాయి.

యువతరంలో మంచి గుర్తింపు ఉన్న  మనస్విని బాలబొమ్మల చాలా టాలెంటెడ్‌.. తెలుగులో 'కొక్కొరొకో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.

ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల  తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్‌లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగుసినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడంతో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది.

సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన అనుభవం ఆమెకు ఉంది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.. కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం  ఉంది. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.. ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబిస్తాయి.

'కొక్కొరొకో' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement