breaking news
Samudrakhani
-
వాంగ అన్నే రెడీయా... తెలుగు హీరోల చూపు అటువైపే
టాలీవుడ్... కోలీవుడ్.... మాలీవుడ్... శాండల్‌వుడ్... బాలీవుడ్... ఇప్పుడు అన్ని వుడ్స్ ఒకటే. ఇప్పటివరకూ హీరోయిన్లు మాత్రమే రక రకాల భాషల్లో సినిమాలు చేసేవారు. అప్పుడప్పుడూ డైరెక్టర్లు కూడా వేరే భాషల్లో వేరే హీరోలతో సినిమాలు చేసేవారు. అయితే ఆ కాంబినేషన్ అరుదుగా సెట్ అయ్యేది. ఇప్పుడు పాన్ ఇండియా’ హవాతో తెలుగు హీరోలు తమిళ దర్శకులతో... తమిళ హీరోలు తెలుగు దర్శకులతో.... అలానే వేరే భాషల దర్శకులతో ఇంకో భాషకు చెందిన హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కువైంది. ఒక్క తెలుగు గురించి మాట్లాడుకుంటే... ఇక్కడి టాప్ స్టార్స్ కొందరు తమిళ దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ అవి సెట్స్ మీద ఉన్నాయి. కొన్ని చర్చల్లో ఉన్నాయి. ఇక ‘వాంగ అన్నే... రెడీయా... స్టార్ట్ కెమెరా’ (రండి అన్నా... రెడీయా... స్టార్ట్ కెమెరా) అంటూ తెలుగు హీరోలను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్న తమిళ దర్శకులు, చర్చల్లో ఉన్న దర్శకుల గురించి తెలుసుకుందాం. యంగ్ డైరెక్టర్‌తో నూరవ చిత్రం నూరవ చిత్రం అనేది ఏ హీరోకైనా వెరీ వెరీ స్పెషల్. ఈ మైల్స్టోన్ మూవీ గ్రాండ్‌గా ఉండాలని, మంచి కథతో, మంచి దర్శకుడితో రూపొందించాలని అనుకుంటారు. నాగార్జున కూడా అలానే అనుకుని, పకడ్బందీగాప్లాన్ చేసుకున్నారు. అయితే తెలుగు దర్శకుడికి కాకుండా తన నూరవ చిత్రం దర్శకత్వ బాధ్యతను తమిళ దర్శకుడు ఆర్ఏ కార్తీక్‌కి ఇచ్చారు. దాదాపు ఏడాది క్రితం నాగార్జునకు కార్తీక్ ఓ స్టోరీ లైన్ వినిపించారని, అది నచ్చి కథగా డెవలప్ చేయమన్నారనీ తెలిసింది. ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కార్తీక్‌కి ఇది రెండో చిత్రం.తమిళ చిత్రం ‘నిదమ్ ఒరు వానమ్’తో దర్శకుడిగా పరిచయమై, రెండో ఫీచర్ ఫిల్మ్‌కే నాగార్జునలాంటి స్టార్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100, కింగ్ 100 నాటౌట్, లాటరీ కింగ్’ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం లాటరీ నేపథ్యంలో ఉంటుందని భోగట్టా. అందుకే ‘లాటరీ కింగ్’ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రంలో టబు నటిస్తున్నారు. అలాగే అనుష్క ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. మల్టీస్టారర్ మూవీలో ఎన్టీఆర్? ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్, ‘వార్ 2’లో హృతిక్ రోషన్ కాంబినేషన్లో నటించిన ఎన్టీఆర్ మరో మల్టీస్టారర్ మూవీ చేయనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. రజనీకాంత్‌తో ‘జైలర్’ వంటి హిట్ మూవీ తెరకెక్కించి, ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా రజనీతోనే ‘జైలర్’ 2’ తెరకెక్కిస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ నెక్ట్స్ ఓ సినిమాప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ కోసం నెల్సన్ ఓ భారీ యాక్షన్ స్టోరీని తయారు చేశారని సమాచారం. ఆ స్టోరీ లైన్‌ని ఎన్టీఆర్‌కి వినిపించారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్.మరోవైపు కొత్త చిత్రాల కోసం కథలు వింటున్నారట. ఈ నేపథ్యంలోనే నెల్సన్ చెప్పిన స్టోరీ లైన్ విని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. అయితే మల్టీస్టారర్ మూవీగా రూపొందనుందని భోగట్టా. ఎన్టీఆర్‌తో పాటు మరో స్టార్ హీరో ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం అవుతోంది. తెలుగు–తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందించాలనుకుంటున్నారట. సో... ఓ తమిళ స్టార్ హీరో నటించే అవకాశం ఉందని అటు చెన్నై ఫిల్మ్‌నగర్ అంటున్న మాట. మరి... ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సినిమా ఉంటుందా? అది సోలో హీరో సినిమానా? లేక మల్టీస్టారరా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.ఇద్దరు దర్శకులతో... వరుసగా ఇద్దరు తమిళ దర్శకులతో అల్లు అర్జున్ సినిమాలు ఒప్పుకోవడం విశేషం. ఇప్పటికే తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఈ హీరో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ సెట్స్‌లో ఉండగానే... సంక్రాంతి సందర్భంగా మరో చిత్రాన్ని ప్రకటించారు అల్లు అర్జున్. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఆ మధ్య లోకేశ్ హైదరాబాద్ వచ్చి, అల్లు అర్జున్‌కి స్టోరీ లైన్ వినిపించారనే వార్త బయటకు వచ్చింది. దీంతో ఈ దర్శకుడి కాంబినేషన్లో ఈ హీరో సినిమా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఆ ఊహలను నిజం చేస్తూ, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ సినిమా ముగిసే సమయానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోని సినిమా షూట్‌ని ఆరంభించాలనుకుంటున్నారట. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఆరంభం కానుందని తెలిసింది. తమిళ దర్శకుడు–తమిళ బేనర్... ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ తర్వాత రామ్ ఓ కొత్త దర్శకుడితో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. ఈ చిత్రాన్ని దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మించనున్నారట. కాగా టాలీవుడ్‌కి చెందిన ఈ కొత్త దర్శకుడు చెప్పిన కథ రామ్‌కి నచ్చిందని సమాచారం. త్వరలో ఈ సినిమా ఆరంభం కానుందని తెలిసింది. మరోవైపు తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ నటుడు–దర్శకుడు సముద్ర ఖనితో సినిమా చేయడానికి రామ్ అంగీకారం తెలిపారని భోగట్టా. ఈ చిత్రాన్ని తమిళ బేనర్ కేవీఎన్ నిర్మించనుందట.ఈ సినిమా కథ రెడీ అయిందని, రామ్‌కి సముద్ర ఖని కథ నరేట్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ కథ నచ్చి, ఈ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాఘవేంద్ర రావు బేనర్లో నూతన దర్శకుడితో సినిమా పూర్తయ్యే సమయానికి సముద్ర ఖనితో సినిమాని పట్టాలెక్కించాలనుకుంటున్నారట రామ్. ఇక సముద్ర ఖని ఇప్పటికే తెలుగులో ‘శంభో శివ శంభో, జెండా పై కపిరాజు, బ్రో’ వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.ఉన్నట్లా? లేనట్లా? ‘దసరా, హిట్ 3’... ఇలా వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని ప్రస్తుతం మరో మాస్ యాక్షన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన మాస్ సినిమాలు ఒక ఎత్తయితే ఈ సినిమా మరో ఎత్తు అనేలా భారీ యాక్షన్‌తో రూపొందుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాని. ఇక రెండు మూడేళ్లుగా ఫలానా దర్శకుడితో నాని సినిమా చేయనున్నారంటూ వినిపించిన లిస్ట్‌లో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా ఉంది.శివ కార్తికేయన్ హీరోగా శిబి దర్శకత్వంలో రూపొందిన ‘డాన్’ (2022) సినిమా చూసి, ఇంప్రెస్ అయ్యారట నాని. ఈ నేపథ్యంలోనే శిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారనే వార్త ప్రచారమైంది. నానీకి శిబి స్టోరీ లైన్ కూడా చెప్పారట. అయితే ఆ లైన్ అసంతృప్తిగా అనిపించడంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్‌లో పడిందని సమాచారం. మరి... నాని–శిబి చక్రవర్తి కాంబినేషన్లో సినిమా ఉన్నట్లా? లేనట్లా... కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే.... ఈ యువదర్శకుడికి సూపర్ స్టార్ రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుందర్ ఔట్ శిబి ఇన్ ‘తలైవర్ 173’ (వర్కింగ్ టైటిల్) పేరుతో రజనీకాంత్ హీరోగా శిబి చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమాకి ముందు సుందర్. సీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఓ నిర్మాత. కమల్–రజనీ–సుందర్ కాంబినేషన్లో ‘తలైవర్ 173’ ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే సుందర్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత పలువురి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్లీ సూపర్ స్టార్ సినిమా శిబి చక్రవర్తికి దక్కింది. ఇలా తెలుగు–తమిళ దర్శకుల కాంబినేషన్లో సినిమాలంటూ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. – డి.జి. భవాని -
యూత్‌ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ
టాలీవుడ్లోకి యంగ్ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్‌గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది. ఈ మూవీ నుంచి తాజాగా ప్రత్యేకమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్ గురించి ప్రశంసలు వస్తున్నాయి.యువతరంలో మంచి గుర్తింపు ఉన్న మనస్విని బాలబొమ్మల చాలా టాలెంటెడ్.. తెలుగులో 'కొక్కొరొకో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్‌పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగుసినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడంతో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది.సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన అనుభవం ఆమెకు ఉంది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.. కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.. ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్‌ను ప్రతిబింబిస్తాయి.'కొక్కొరొకో' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Manaswini (@mcanutikki) -
ఓ తండ్రి కథ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం రామం రాఘవం ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.తల్లిదండ్రులకు పిల్లల మీద ఉండేది మమకారం. వారి మాట వినకూడదని పిల్లల మూర్ఖత్వం. జన్మనిచ్చిన తల్లి... జీవితాన్నిచ్చే తండ్రి తమ కన్నపిల్లల బంగారు భవిష్యత్తు కోసమే కాస్తంత కటువుగా మారతారు. ఆ కటుత్వం మాటున ఆప్యాయత, అనురాగాలుంటాయి. అవి అర్థం చేసుకోని పిల్లలు ఎంతో నష్టపోతారు. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమానే ‘రామం రాఘవం’. తల్లి ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రి ప్రేమను ఇంత లోతుగా చూపించిన సినిమా ఇదే. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు సముద్రఖని అందించిన ఈ కథకు నటుడు ధన్‌రాజ్ దర్శకత్వం వహించారు. ‘రామం రాఘవం’ అనేది పిల్లలకు పెద్దలు చెప్పిన పాఠం అయితే, పిల్లలకు ఇదో గుణపాఠం. అంతలా ఏముందీ సినిమాలో ఓ సారి చూద్దాం. దశరథ రామం కోనసీమ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఓ నిజాయితీ గల అధికారి. తనలాగే తన కొడుకు రాఘవను నీతీ నిజాయితీతో నిండిన మంచి వ్యక్తిలా తీర్చిదిద్దాలనుకుంటాడు. కానీ రాఘవ చదువు కూడా కనీసం సరిగ్గా చదువుకోకుండా ఇంటా బయటా తండ్రికి తలవంపులు తెస్తుంటాడు.అంతేకాదు తనను మందలించిన తండ్రి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుని ఆఖరికి తన తండ్రి అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. రాఘవ చేసిన ప్రతి తప్పును క్షమించి కాస్తంత మందలిస్తూ అంతులేని బాధను అనుభవిస్తుంటాడు రామం. ఆఖరికి రాఘవ తన తండ్రి కోసం చేసిన ప్రయత్నమేంటి? దాని వల్ల రాఘవ పొందిన లాభం ఏంటి? అన్నది మాత్రం ఓటీటీ వేదికైన సన్ నెక్ట్స్‌లో చూడాల్సిందే. నటుడిగా ధన్‌రాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.మరీ ముఖ్యంగా కామెడీ పాత్రలతో ప్రేక్షకులను బాగానే మెప్పించారు. నటుడిగా ధన్‌రాజ్ నాణేనికి ఓ వైపు మాత్రమే, ఈ సినిమాతో ధన్‌రాజ్ తన దర్శకత్వ ప్రతిభను ఘనంగా చాటారనే చెప్పుకోవాలి. ఓ పక్క కథను అందించి, కథలోని తండ్రి పాత్రకు ఊపిరి పోసింది సముద్రఖని అయితే మరో పక్క అదే కథకు దర్శకత్వం వహించి, కొడుకు పాత్రలో ఒదిగిపోయి ఆ కథకు జీవితాన్నిచ్చింది ధన్‌రాజ్.కొన్ని సినిమాలు ఆనందం కోసం చూస్తాం. ఇలాంటి సినిమాలు మాత్రం మన జీవితం కోసం చూడాలి. మరీ ముఖ్యంగా మీ తల్లిదండ్రుల కోసం చూడాలి. వీలైతే మీ తల్లిదండ్రులతో కలిసి ఈ ‘రామం రాఘవం’ చూడండి. – హరికృష్ణ ఇంటూరు -
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
టైటిల్: రామం రాఘవంనటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులునిర్మాత: పృథ్వీ పోలవరపుకథ: శివప్రసాద్ యానాలదర్శకత్వం: ధన్రాజ్సంగీతం: అరుణ్ చిల్లివేరుసినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్, సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు.. ఫస్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్ లవ్‌ట్రాక్ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్ ఓకే.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తమిళ డైరెక్టర్ కొడుకు హీరోగా ‘ హిట్ లిస్ట్’
తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
మంచి సినిమాకి ఆదరణ ఉంటుంది
‘‘డైరెక్టర్ శివ ప్రసాద్‌గారు తొలి సినిమా ‘విమానం’తో మంచి హిట్ అందుకున్నందుకు అభినందనలు. మంచి సినిమాకు ప్రేక్షకాదరణ ఉంటుందనే విషయాన్ని ‘విమానం’ మరోసారి నిరూపించింది’’ అని నటుడు, దర్శకుడు సముద్ర ఖని అన్నారు. శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన సక్సెస్ మీట్లో కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ– ‘‘విమానం’ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. ఇలాంటి చిత్రాలను ఆదరిస్తే కొత్త దర్శకులకు ఇంకా మంచి ఉత్సాహం వస్తుంది’’ అన్నారు. ‘‘విమానం’ చిత్రం చూశాక ‘మా నాన్న గుర్తుకొచ్చాడు’ అంటూ మా నాన్న, అమ్మ చెప్పడంతో చాలా ఆనందం వేసింది’’ అన్నారు శివప్రసాద్ యానాల. నటుడు ధనరాజ్, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, రైటర్ హను, సినిమాటోగ్రాఫర్ వివేక్, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్ మాట్లాడారు. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘విమానం’ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాలతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ని దర్శకుడు శివ ప్రసాద్ ట్రైలర్లో అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ నా మనసును కదిలించింది.. నాకు కన్నీళ్లొచ్చాయి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ‘విమానం’ సినిమా చూడాలి.. అప్పుడే పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది’’ అన్నారు. జీ స్టూడియో సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కాలేపు. -
ఆకట్టుకుంటున్న బ్రహ్మానందం ‘పంచ తంత్రం’ ట్రైలర్
బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటిస్తున్న యాంథాలజీ ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది. ‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్‌గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ముందుకు సాగుతుంది. ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. డిసెంబర్9న ఈ చిత్రం విడుదల కాబోతంది. -
కలెక్టర్‌గా నితిన్ మెప్పించాడా? 'మాచర్ల నియోజకవర్గం' మూవీ రివ్యూ
టైటిల్: మాచర్ల నియోజకవర్గం నటీనటులు: నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా, సముద్ర ఖని, వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి దర్శకత్వం: ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరేళ్ల విడుదల తేది: ఆగస్టు 12, 2022 నితిన్, కృతీశెట్టి, కేథరిన్ థ్రేసా హీరోహీరోయిన్లుగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘'మాచర్ల నియోజకవర్గం'’. ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్టు 12) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ: సిద్ధార్థ రెడ్డి (నితిన్) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ పొందుతాడు. అక్కడ కొన్ని ఏళ్లపాటు ఎన్నికలు జరగవు. అందుకు కారణం రాజప్ప అని తెలుసుకున్న సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అక్కడి పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? ఈ క్రమంలో సిద్ధార్థ రెడ్డి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: ఎప్పుడు ప్రేమకథా చిత్రాలతో అలరించిన నితిన్.. అందుకు భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న 'మాచర్ల నియోజకవర్గం' సినిమాతో ముందుకొచ్చాడు. సినిమాలో పాలిటిక్స్, కలెక్టర్ విధులు చూపిస్తూనే కామెడీని పండించే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి. కొత్త డైరెక్టర్ కొత్త ఫార్ములాతో వస్తే బాగుండేది. కానీ రెగ్యూలర్ రొటీన్ ఫార్ములాతో తెరపై 'మాచర్ల నియోజకవర్గం'ను ఆవిష్కరించాడు. అక్కడక్కడ స్క్రీన్‌ప్లే కొద్దిగా స్లో కావడంతో సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇక నితిన్‌ను కొత్తగా చూపించారు. కలెక్టర్‌గా నితిన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎవరెలా చేశారంటే? గుంటూరు కలెక్టర్ సిద్ధార్థ రెడ్డిగా నితిన్ కొత్తగా కనిపించాడు. స్టైలిష్ లుక్ నుంచి నటన, అభినయం వరకు ఆకట్టుకున్నాడు. కామెడీ సన్నివేశాలతోపాటు ఫైటింగ్ సీన్లలో మెప్పించాడు. ఇక స్వాతి పాత్రలో హీరోయిన్ కృతీశెట్టి నటన అలరిస్తుంది. కేథరీన్ థ్రేసా తన పాత్ర పరిధిమేర నటించింది. సముద్ర ఖని విలనిజం, వెన్నెల కిశోర్ కామెడీ పర్వాలేదనిపిస్తుంది. తదితర పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సన్నివేశాలు తగినట్లుగా బీజీఎం ఆకట్టుకుంది. ఇక అంజలి మెరిసిన రారా రెడ్డి ప్రధానాకర్షణగా నిలిచింది. ఫైనల్‌గా రొటీన్ ఫార్ములాతో నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' ఉంది. -
'మాచర్ల నియోజకవర్గం' నటుడిగా సంతృప్తినిచ్చింది: సముద్ర ఖని
మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు థియేరట్స్కి వస్తారు. రీసెంట్గా 'సీతారామం', 'బింబిసార' చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. ఈ సక్సెస్‌ను మాచర్ల నియోజకవర్గం కొనసాగిస్తుందని నమ్ముతున్నాను అన్నారు దర్శక, రచయిత-నటుడు సముద్ర ఖని. నితిన్, కృతిశెట్టి జంటగా ఎమ్ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈనెల 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసిన సముద్ర ఖని మాట్లాడుతూ.. ''ఇందులో రాజప్ప అనే పాత్ర చేశాను. నటనకు మంచి ఆస్కారం ఉండటంతో సవాల్‌గా తీసుకొని నటించాను. ఈ చిత్రకథ తరమాలోనే తమిళనాడులోని ఓ ప్రాంతంలో 25 ఏళ్లు ఎలక్షన్స్ జరగలేదు. చివరికి ఉదయ్‌శంకర్ అనే ఓ ఐఏఎస్ ఆఫీసర్ చొరవ తీసుకుని స్థానికులతో మాట్లాడి ఎలక్షన్స్ జరిగేలా చేశారు. ఈ అంశాన్ని రాజశేఖర్‌తో షేర్ చేసుకున్నాను అన్నారు. ఇంకా మాట్లాడుతూ రచన అంటే నాకు ప్రాణం. లొకేషన్లో ఖాళీ సమయం దొరికినప్పుడు కథలు రాస్తుంటాను. ప్రస్తుతం చిరంజీవిగారి గాడ్‌ఫాదర్, నానీ దసరా సినిమాల్లో నటిస్తున్నాను'' అన్నారు. -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
మీడియా సమావేశంలో రైటర్ చిత్ర యూనిట్
చెన్నై సినిమా: తన భావాలతో ఏకీభవిస్తేనే ఎవరికైనా తన కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని దర్శక నిర్మాత పా.రంజిత్ అన్నారు. 'అట్టకత్తి'తో దర్శకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత మద్రాస్, కబాలి, కాలా, సర్పట్టా వంటి విజయవంత చిత్రాలకు దర్శకత్వం వహించారు. అదే విధంగా నిర్మాతగానూ నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నవ దర్శకులకు అవకాశం కల్పిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను నిర్మిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్, గోల్డెన్ రాటీయో ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన తాజా చిత్రం 'రైటర్'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో ఇనియా నాయికగా నటించారు. ఈ చిత్రం ద్వారా ఫ్రాంక్లిన్ జాకోబ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గోవింద్ వసంత సంగీతాన్ని అందించిన 'రైటర్' చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం మీడియో సమావేశంలో పా.రంజిత్ మాట్లాడుతూ.. సమాజంలోని సమస్యలను ఆవిష్కరించే విధంగా తన చిత్రాలు ఉంటాయన్నారు. -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. -
అప్పుడు దర్శకుడు.. ఇప్పుడు నటుడు
తెలుగులో ‘శంభో శివ శంభో, జెండాపై కపిరాజు’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సముద్రఖని. తమిళంతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన ఆ తర్వాత నటుడిగా మారారు. వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని తాజాగా రవితేజ–గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. ‘డాన్ శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. లైట్ హౌస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘ఠాగూర్’ మధు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘బలుపు’ తర్వాత ఈ చిత్రంలో రవితేజతో జోడీ కట్టారు శ్రుతీహాసన్. ఇదిలా ఉంటే సముద్రఖని దర్శకత్వంలో రవితేజ, ‘అల్లరి’ నరేశ్, శివబాలాజీ, ప్రియమణి తదితరుల కాంబినేషన్లో వచ్చిన ‘శంభో శివ శంభో’ చిత్రం మంచి విజయం సాధించిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పుడు దర్శకుడిగా రవితేజ సినిమా చేస్తే ఇప్పుడు నటుడిగా రవితేజ సినిమాలో నటించనున్నారు సముద్రఖని. -
బాబాయ్‌గా...!
నటుడిగా, డైరెక్టర్‌గా సముద్రఖని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘కాలా’ చిత్రంలో రజనీకాంత్ ఫ్రెండ్‌గా, ‘రఘవరన్ బీటెక్’ చిత్రంలో ధనుశ్ తండ్రిగా సముద్రఖనిని చూసే ఉంటారు. తెలుగులో వచ్చిన రవితేజ ‘శంభో శివ శంభో’, నాని ‘జెండాపై కపిరాజు’ సినిమాలకు ఆయనే దర్శకుడు. ఇప్పుడు ఓ కీలక పాత్రతో ఆయన తెలుగు తెరపై మరోసారి కనిపించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారన్నది తాజా ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో ఆయన రామ్‌చరణ్ పాత్రకు బాబాయ్‌గా కనిపిస్తారట. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ జనవరిలో స్టార్ట్ కానుంది. ఇందులో హీరోయిన్లుగా కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. -
శశికుమార్, నానిలతో ద్విభాషాచిత్రం?
చెన్నై: తమిళనటుడు శశికుమార్, తెలుగు నటుడు నానిలతో దర్శకుడు సముద్రఖని ద్విభాషా చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరందుకుంది. నటుడు, దర్శకుడు అంటూ జోరు గుర్రాల స్వారీ చేస్తున్న సముద్రఖని ఇటీవల స్వీయ దర్శకత్వంలో నటించిన అప్పా, తొండన్ చిత్రాలు విశేష ప్రేక్షకాదరణను పొందాయి. మరో పక్క ఇతర చిత్రాలలో ముఖ్య పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న సముద్రకని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఈయన తమిళంలో దర్శకత్వం వహించిన నాడోడిగళ్ చిత్రాన్ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. అదే విధంగా జయంరవి ద్విపాత్రాభినయం చేసిన నిమిర్న్దు నిల్ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందించారు. తెలుగులో జెండాపై కపిరాజు పేరుతో తెరకెక్కిన ఇందులో నాని కథానాయకుడిగా నటించారు. ఇదే విధంగా మరో సారి సముద్రకని ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇందులో తమిళవెర్షన్లో శశికుమార్, తెలుగులో నాని హీరోలుగా నటించనున్నట్లు సమాచారం. నాని వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన తెలుగు చిత్రం నిన్నుకోరి శుక్రవారం తెరపైకి రానుంది. కాగా నాని అక్కడ వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. సముద్రకని దర్శకత్వంలో ఎప్పుడు నటిస్తారన్న విషయం గురించి క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అదే విధంగా శశికుమార్ ప్రస్తుతం కొడివీరన్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.


