టీవీకే అధినేత విజయ్, త్రిష వివాదానికి సంబంధించి వైరల్ అయిన తన వ్యాఖ్యల వివాదంపై నటుడు, దర్శకుడు సముద్రఖని తాజాగా స్పందించారు. తాను నటించిన ‘కార్మేని సెల్వం’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. విజయ్‌పై తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సందర్భానికి సంబంధం లేకుండా వాటికి వక్రీకరణలు చేశారని ఆయన అన్నారు. తాను నిజాయితీగా మాట్లాడానని, ఎవరినీ అవమానించే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన ఆలోచనలను వ్యక్తం చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని, ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేశారని క్లారిటీ ఇచ్చారు.
'పాత వీడియోలో నేను మాట్లాడుతున్న సమయంలో ఓ వ్యక్తి మొదటి నుంచి కాకుండా మధ్యలో వీడియో రికార్డ్ చేశారు. అయితే, తను రికార్డ్ చేస్తున్నాడు కదా అని నేను మాట్లాడటం ఆపలేదు. విజయ్ మొదట సపోర్ట్ ఇచ్చింది నేనే.. కాబట్టే కాస్త నాకు పెయిన్‌గానే ఉంటుంది.' అని వివరించారు.
ఏం జరిగిందంటే..?
విజయ్, త్రిష ఒక పెళ్లి వేడుకలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇదే అంశం గురించి సముద్రఖని కొందరితో చర్చిస్తన్న వీడియో వైరల్ అయింది. వారిద్దరి తీరుపై సముద్రఖని తన అసంతృప్తిని బయటపెట్టారు. 'ఇదేమైనా ఆటా..? వ్యక్తిగత విషయాలను ఇలా బయటపెట్టాలా..? ఎవరి మీద పగ తీర్చుకుంటున్నారు..? అంతా సవ్యంగ జరుగుతున్న సమయంలో ఇలాంటివి అవసరమా..? ఈ కారణంతో పార్టీలోని కొందరు సపోర్టర్స్ వెళ్లిపోతున్నారు' అని ఆయన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆ వీడియో కాస్త వైరల్ అయింది.


