భాస్కర్‌ డేట్‌ ఫిక్స్‌ | Lucky Baskhar grand release worldwide on Sep 7th | Sakshi
Sakshi News home page

భాస్కర్‌ డేట్‌ ఫిక్స్‌

Jul 9 2024 1:08 AM | Updated on Jul 9 2024 1:08 AM

Lucky Baskhar grand release worldwide on Sep 7th

భాస్కర్‌గా దుల్కర్‌ సల్మాన్‌ టైటిల్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. మీనాక్షి చౌదరి కథానాయిక. 1980–90ల కాలంలో అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్‌ క్యాషియర్‌ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్‌ 7న ‘లక్కీ భాస్కర్‌’ని రిలీజ్‌  చేయనున్నట్లు సోమవారం యూనిట్‌ పేర్కొంది.

తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్‌ కానుంది. ‘‘ముంబైలోని బ్యాంకులో పని చేసే క్యాషియర్‌గా కనిపిస్తారు దుల్కర్‌. నాటి ముంబై నగరాన్ని, భారీ బ్యాంకు సెట్‌ని హైదరాబాద్‌లో రూపొందించాం. భాస్కర్‌ అసాధారణ ప్రయాణంలో ప్రేక్షకులు లీనమైపోతారు’’ అని యూనిట్‌ పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement