Love Mouli Movie: క్రేజీ సాంగ్.. డిఫరెంట్ లుక్‌లో స్టార్ హీరో

Love Mouli Movie Song Actor Navdeep - Sakshi

యువనటుడు నవదీప్ చాలా రోజులు తర్వాత చేస్తున్న సినిమా 'లవ్ మౌళి'. అవనీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి తాటికొండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన నవదీప్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గుబురు గడ్డం, ఒక బైక్, ట్రావెలర్‌గా కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా నుండి 'ద ఏoథమ్ ఆఫ్ లవ్ మౌళి' సాంగ్‌ని రిలీజ్ చేశారు. 

(ఇదీ చదవండి: 'జవాన్' కోసం దీపిక నో రెమ్యునరేషన్.. కారణం అదే?)

"అందాలు చదివే కళ్లకైనా.. కందాలు తిరిగే కాళ్లకైనా.. వందేళ్లు కదిలే గుండె కైనా.. ప్రేమన్న తీరం ఇదేనా.." అని సాగే పాటలో నవదీప్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. నవదీప్ 2.0 అంటూ ఈ మూవీతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా, పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్‌తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 

మ్యూజిక్ డైరెక్టర్ గోవింద వసంత కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాశారు. అనిల్ కృష్ణన్ పాడిన విధానం అందర్నీ ఆకట్టుకుంటుంది. మేఘాలయలోని చిరపుంజీలో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని చిత్రీకరించారు. ఇలాటి వెట్ ప్లేస్‌లో షూటింగ్ జరిగిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా ఈ చిత్రం  నిలిచింది. అలాగే థాయ్ కుడెం బ్రిడ్జి షూట్ చేశారు. తాటికొండ ప్రశాంత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top