కొత్త ఇంట్లోకి ఫైమా.. అమ్మని పట్టుకుని ఏడ్చేసింది! | Jabardasth Faima New Home Video Viral | Sakshi
Sakshi News home page

Faima New Home: కన్నతల్లి కోరిక నెరవేర్చిన 'బిగ్‌బాస్' ఫైమా

Sep 15 2023 6:39 PM | Updated on Sep 15 2023 6:44 PM

Jabardasth Faima New Home Video Viral - Sakshi

తెలుగులో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ మంది. అందులో ఫైమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీవీ షోలతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె.. తనదైన మార్క్ కామెడీ టైమింగ్‌తో అలరిస్తూ ఉంటుంది. అలాంటి ఈమె.. ఇప్పుడు కొత్తింట్లో అడుగుపెట్టింది. అప్పట్లో తన తల్లికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంది.

'పటాస్' షోలో స్టాండప్ కామెడీ చేస్తూ వెలుగులోకి వచ్చిన ఫైమా.. ఆ తర్వాత 'జబర్దస్త్'లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలుత సహాయ పాత్రల్లో కనిపించిన ఈమె.. తన మార్క్ విచిత్రమై యాస, టైమింగ్‌తో ఆకట్టుకుంది. ఒకానొక దశలో టీమ్ లీడర్స్‌నే డామినేట్ చేసి మరీ గుర్తింపు తెచ్చుకుంది.

(ఇదీ చదవండి: 'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ)

అలా కమెడియన్‌గా చాలా క్రేజ్ తెచ్చుకున్న ఫైమా.. గతేడాది 'బిగ్‌బాస్'లో పాల్గొంది. దాదాపు 10 వారాల పాటు ఉండి, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. అయితే షోలో అడుగుపెట్టినప్పుడు తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పింది. బీడీలు చుట్టి, అలా వచ్చిన డబ్బుతో తమని పెంచిందని చెప్పిన ఫైమా.. ఆమెకి ఓ ఇల్లు కట్టివ్వాలనేదే తన కోరిక అని చెప్పింది. ఇప్పుడు ఆ కలని నిజం చేసి చూపించింది.

ఇదిలా ఉండగా ఫైమా.. ప్రస్తుతం పలు షోల్లో కమెడియన్, డ్యాన్సర్‌గా ఆకట్టుకుంటోంది. మరోవైపు 'పటాస్' నుంచి తనతో ట్రావెల్ అవుతున్న కమెడియన్ ప్రవీణ్‪‌తో ఈమె ప్రేమలో ఉంది. ఇక ఎలానూ ఇల్లు కట్టేసింది కాబట్టి త్వరలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. చూడాలి ఎప్పుడో ఆ శుభకార్యం జరుగుతుందో?

(ఇదీ చదవండి: అతడితో పులిహోర కలిపేస్తున్న రతిక.. పాపం ప్రశాంత్!)

Advertisement
 
Advertisement
Advertisement