ట్రైనింగ్‌ షురూ | Lloyd Stevens Roped In as Fitness Trainer for Allu Arjun | Sakshi
Sakshi News home page

ట్రైనింగ్‌ షురూ

May 4 2025 2:40 AM | Updated on May 4 2025 2:40 AM

Lloyd Stevens Roped In as Fitness Trainer for Allu Arjun

క్యారెక్టర్‌ ఎలా డిమాండ్‌ చేస్తే అలా మారిపోవడానికి అల్లు అర్జున్‌ ఏ మాత్రం వెనకాడరు. కెరీర్‌ తొలి నాళ్లల్లో ‘దేశ ముదురు’ (2007) కోసం సిక్స్‌ ప్యాక్‌ చేశారు అల్లు అర్జున్‌. ఆ తర్వాత క్యారెక్టర్లకు తగ్గట్టుగా తనని తాను మలచుకుంటూ వచ్చారు. తాజాగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో చేయనున్న సినిమా కోసం ట్రాన్స్‌ఫార్మ్‌ అవుతున్నారు. ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కోసం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్స్‌ స్టీవెన్‌ని నియమించుకున్నారు.

ఈ విషయాన్ని లాయిడ్స్‌ సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించి, అల్లు అర్జున్, తానూ ఉన్న ఫొటోని షేర్‌ చేశారు. లాయిడ్స్‌ మామూలు ట్రైనర్‌ కాదు. ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌కి ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ కోసం రంగంలోకి దిగారు. సో.. అట్లీ సినిమాలో అల్లు అర్జున్‌ కొత్తగా కనిపిస్తారని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement