six-packs
-
ట్రైనింగ్ షురూ
క్యారెక్టర్ ఎలా డిమాండ్ చేస్తే అలా మారిపోవడానికి అల్లు అర్జున్ ఏ మాత్రం వెనకాడరు. కెరీర్ తొలి నాళ్లల్లో ‘దేశ ముదురు’ (2007) కోసం సిక్స్ ప్యాక్ చేశారు అల్లు అర్జున్. ఆ తర్వాత క్యారెక్టర్లకు తగ్గట్టుగా తనని తాను మలచుకుంటూ వచ్చారు. తాజాగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో చేయనున్న సినిమా కోసం ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్స్ స్టీవెన్‌ని నియమించుకున్నారు.ఈ విషయాన్ని లాయిడ్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించి, అల్లు అర్జున్, తానూ ఉన్న ఫొటోని షేర్ చేశారు. లాయిడ్స్ మామూలు ట్రైనర్ కాదు. ఇప్పటికే మహేశ్‌బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌కి ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగారు. సో.. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ కొత్తగా కనిపిస్తారని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారు. -
'చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు'
ముంబై: సిక్స్ ప్యాక్ చూపించే వరకు సినిమాల్లో నటించకూడదనుకున్నానని బాలీవుడ్ నటుడు, గాయకుడు అయుష్మాన్ ఖురానా తెలిపాడు. వికీ డోనర్, దమ్ లాగా కె హైసా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తన ఫిట్ నెస్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'సిక్స్ ప్యాక్ చూపించే వరకు సినిమాల్లోకి రాకూడదనుకున్నా. నేను నటించిన సినిమాలు వాస్తవ జీవితానికి దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పటివరకు చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు. నా సినిమాలన్నీ కథానుసారంగ సాగుతాయి కాబట్టి సిక్స్ చూపించాల్సిన అవకాశం రాలేదు' అని అయుష్మాన్ తెలిపాడు. సిక్స్ ప్యాక్ కంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యమని చెప్పాడు. ఎవరి శరీరతత్వానికి అనుగుణంగా వారు డైట్ తీసుకోవాలని సూచించారు. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆగ్రా కా దాబ్రా' సినిమాలో ప్రస్తుతం అతడు నటిస్తున్నాడు. అతడికి జోడీగా తాప్సీ నటిస్తోంది.