'చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు' | Don't do films where I've to show six-packs: Ayushmann | Sakshi
Sakshi News home page

'చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు'

Dec 17 2015 6:39 PM | Updated on Sep 3 2017 2:09 PM

'చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు'

'చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు'

సిక్స్ ప్యాక్ చూపించే వరకు సినిమాల్లో నటించకూడదనుకున్నానని బాలీవుడ్ నటుడు, గాయకుడు అయుష్మాన్ ఖురానా తెలిపాడు.

ముంబై: సిక్స్ ప్యాక్ చూపించే వరకు సినిమాల్లో నటించకూడదనుకున్నానని బాలీవుడ్ నటుడు, గాయకుడు అయుష్మాన్ ఖురానా తెలిపాడు. వికీ డోనర్, దమ్ లాగా కె హైసా చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తన ఫిట్ నెస్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

'సిక్స్ ప్యాక్ చూపించే వరకు సినిమాల్లోకి రాకూడదనుకున్నా. నేను నటించిన సినిమాలు వాస్తవ జీవితానికి దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పటివరకు చొక్కా విప్పాల్సిన అవసరం రాలేదు. నా సినిమాలన్నీ కథానుసారంగ సాగుతాయి కాబట్టి సిక్స్ చూపించాల్సిన అవకాశం రాలేదు' అని అయుష్మాన్ తెలిపాడు. 

సిక్స్ ప్యాక్ కంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యమని చెప్పాడు. ఎవరి శరీరతత్వానికి అనుగుణంగా వారు డైట్ తీసుకోవాలని సూచించారు. సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆగ్రా కా దాబ్రా' సినిమాలో ప్రస్తుతం అతడు నటిస్తున్నాడు. అతడికి జోడీగా తాప్సీ నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement