Varun Tej And Lavanya Tripathi Engagement: Lavanya Tripathi Says She Is In Love With Varun Tej From 2016 - Sakshi
Sakshi News home page

Varun Tej- Lavanya Tripathi: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్‌ వైరల్‌

Jun 10 2023 9:50 AM | Updated on Jun 10 2023 10:34 AM

Lavanya Tripathi Says She is in Love with Varun Tej From 2016 - Sakshi

ఆ పుకార్లే నిజం చేస్తూ వరుణ్‌, లావణ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు

వరుణ్‌ తేజ్‌- లావణ్యలు ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ వార్తను అప్పుడే రివీల్‌ చేస్తే సస్పెన్స్‌ ఉండదనుకున్నారో ఏమో కానీ ఎప్పుడూ ఈ ప్రచారాన్ని ధృవీకరించలేదు. లావణ్య త్రిపాఠి అయితే తమ మధ్య ఏమీ లేదని, అదంతా వట్టి పుకారేనని చెప్పింది.

కానీ అంతలోనే ఓ ఇంటర్వ్యూలో మోస్ట్‌ హ్యాండ్సమ్‌ హీరో ఎవరన్న ప్రశ్నకు వరుణ్‌ తేజ్‌ అని బదులిస్తూ సిగ్గులమొగ్గైంది. దీంతో వీరి డేటింగ్‌ రూమర్స్‌ మరోసారి తెరపైకి వచ్చాయి. చివరకు ఆ పుకార్లే నిజం చేస్తూ వరుణ్‌, లావణ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్‌ చేశారు. నాకు ప్రేమ దొరికింది అని వరుణ్‌, 2016 నుంచే ఈ ఇష్క్‌ మొదలైంది, శాశ్వత ప్రేమను కనుగొన్నాను అంటూ లావణ్య క్యాప్షన్‌లో రాసుకొచ్చారు.

అంటే వీరిద్దరూ మిస్టర్‌ మూవీ షూటింగ్‌లోనే లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ వీరు కలిసి నటించారు. పార్టీ, వెకేషన్‌కు కూడా కలిసే వెళ్లేవారు. కానీ ప్రేమ గురించి అడిగినప్పుడల్లా నిశ్శబ్ధంగా ఉండేవారు. మొత్తానికి సస్పెన్స్‌కు కళ్లెం వేస్తూ గుడ్‌ న్యూస్‌ పంచుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భర్తగా ప్రమోషన్‌ పొందుతున్న వరుణ్‌ తేజ్‌కు, మెగా ఇంటి కోడలిగా వస్తున్న లావణ్యకు అభినందనలు తెలియజేస్తున్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: ఘనంగా వరుణ్‌ తేజ్‌- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement