Varun Tej and Lavanya Tripathi Engagement: ఘనంగా వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం

Varun Tej and Lavanya Tripathi Engagement Rings Changed Each Other - Sakshi

మెగా హీరో వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. హైదరాబాద్‌ మణికొండలోని నాగబాబు నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ సభ్యులు, అల్లు అరవింద్, ‍అల్లు అర్జున్, అంజనాదేవి, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా హాజరయ్యారు.

(ఇది చదవండి: అలా ప్రేమలో.. వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు)

నిశ్చితార్థ వేడుకలో చిరంజీవి దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన కూడా పాల్గొన్నారు. ఇరు కుటుంబాల సభ్యులు, ‍ అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిశ్చితార్థ వేడుక జరిగింది. కాగా.. ఈ ఏడాది చివర్లో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top