లావణ్య త్రిపాఠి మూవీ.. రిలీజ్‌ డేట్‌ ప్రకటన | Lavanya Tripathi Movie Sathi Leelavathi New Realsed Date Announced | Sakshi
Sakshi News home page

లావణ్య త్రిపాఠి మూవీ.. రిలీజ్‌ డేట్‌ ప్రకటన

Apr 25 2026 1:05 PM | Updated on Apr 25 2026 1:32 PM

Lavanya Tripathi Movie Sathi Leelavathi New Realsed Date Announced

మెగా కోడలు లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చింది. మార్చి 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో తాజాగా కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. దర్శకుడు తాతినేని సత్య తెరకెక్కించిన ఈ మూవీని ఆనంది ఆర్ట్స్‌ సమర్పణలో నాగమోహన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో వి.కె.నరేశ్, వి.టి.వి.గణేశ్, సప్తగిరి వంటి వారు నటిస్తున్నారు.  సంగీతం  మిక్కీ జె.మేయర్ అందిస్తున్నారు.

‘సతీ లీలావతి’ చిత్రం మే 8న విడుదల కానుందని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇదే పాయింట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ కథలో భార్యగా లీలావతి పాత్రలో లావణ్య త్రిపాఠి నటించగా.. భర్తగా దేవ్‌ మోహన్‌ నటించారు. లావణ్య పెళ్లి తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై సోషల్‌మీడియాలో బజ్‌ క్రియేట్‌ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement